Brahmotsavam Child Artist: ఒక తెలుగు అమ్మాయి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది.ఒకప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమాలో ఈ అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది.ప్రస్తుతం ఈమె హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీ గా దూసుకుపోతుంది.ఈ క్రమంలోనే ఈ తెలుగు అమ్మాయి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది అని చెప్పచ్చు.టాలీవుడ్ లో పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె పేరు అవంతిక వందనపు.
బుల్లితెర మీద ప్రసారం అయ్యే పలు యాడ్స్ లో కూడా నటించిన అవంతిక బాగా ఫేమస్ అయ్యింది.అమ్మను మరచిపోలేము..అంబికను మరచిపోలేము అని యాడ్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఈ యాడ్ లో ఈ డైలాగ్ తో అవంతిక ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రమ్మోత్సవం సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది.
ఆ తర్వాత తెలుగులో ప్రేమమ్,రారండోయ్ వేడుక చూద్దాం,అజ్ఞాతవాసి ఇలా పలు సినిమాలలో నటించింది.హాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ హాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేస్తున్న తెలుగు అమ్మాయి అవంతిక వందనపు.
మీన్ గర్ల్స్ లో కరెన్ శెట్టి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది అవంతిక.ఈ సినిమా హాలీవుడ్ లో మంచి విజయం సాధించటంతో అవంతిక ప్రశంసలు అందుకుంటుంది.దాంతో ఇప్పుడు హాలీవుడ్ లో అవంతిక పేరు మారుమోగిపోతుంది.ఈ క్రమంలోనే ఆమె గురించి సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో సెర్చింగ్ స్టార్ట్ చేసారు నెటిజన్లు.అలాగే ఆమె ఇంస్టా ఐడి ని కూడా షేర్ చేస్తున్నారు.
View this post on Instagram