Jayam Movie Child Artist: జయం సినిమాలో హీరోయిన్ సదా చెల్లెలు ఇప్పుడు యెంత అందంగా ఉందో..ఏం చేస్తుందో తెలుసా!

Jayam Movie Child Artist
Jayam Movie Child Artist

Jayam Movie Child Artist: తెలుగు ప్రేక్షకులకు నటి జయలక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి మంచి పాత్రలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే జయలక్ష్మి మాత్రం తానూ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ తన కూతురిని మాత్రం ఈ రంగంలోకి తీసుకురావాలి అనుకోవడం లేదు అని చెప్తున్నారు.

తన కూతురు యామిని శ్వేతా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది అదే చాలు హీరోయిన్ గా చెయ్యాల్సిన అవసరం లేదు అని తెలిపారు.జయలక్ష్మి కూతురు తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమాలో హీరోయిన్ కు చెల్లెలిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసారు.నితిన్,సదా జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమాలో సదా చెల్లెలిగా యామిని శ్వేతా నటించింది.మొదటి చిత్రంతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా యామిని శ్వేతా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే జయం సినిమా తర్వాత యామిని శ్వేతా మరొక చిత్రంలో నటించలేదు.అమెరికాలో ఉన్న యామిని శ్వేతా పెళ్లి చేసుకొని కొన్ని కోట్ల రూపాయలకు యజమానిగా మారారు.

ఇటీవలే యామిని శ్వేతా తన స్వస్థలమైన విజయవాడలో స్థిరపడినట్లు సమాచారం.అయితే ఆమె అమెరికా నుంచి తిరిగిరావడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమె నటిస్తారేమో అనే వార్తలు వస్తున్నాయి.అయితే నటి జయలక్ష్మి సినిమా ఇండస్ట్రీలో తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి చాల బాధలు పడాల్సి వచ్చిందని,ఆ బాధలు తన కూతుర్లకు వద్దు అని చెప్తున్నారు.నా కూతురిని బాల నటిగా చూడాలి అనుకునే ఆశ తీరిందని చెప్పుకొచ్చారు.ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎన్ని అవకాశాలు వచ్చిన నేను ఓకే చెప్పలేదు.ప్రస్తుతం నా కూతుర్లు వివాహం చేసుకొని అమెరికాలో సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.నా మాట నా కూతుర్లు ఏ రోజు కాదనలేదు ఇంతకన్నా సంతోషం ఇంకేం కావాలి అని చెప్పుకొచ్చారు జయలక్ష్మి.అయితే ఇటీవలే యామిని శ్వేతా కు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *