Tollywood Heroes: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో నట వారసులుగా ఎంట్రీ ఇచ్చిన నటులు చాల మందే ఉన్నారు.తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని స్టార్ హీరో లుగా రాణిస్తున్నారు.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం స్టార్ హీరోలకు రాణిస్తున్న కొంత మంది హీరోల తమ్ముళ్ల ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇవ్వలేదు.దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుగుకుందాం…అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా అక్కినేని నాగార్జున సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.అయితే మొదట్లో ఆయన కొన్ని సినిమాలతో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత పలు సినిమాలతో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.అయితే నాగేశ్వర రావు పెద్ద కొడుకు అక్కినేని వెంకట్ సినిమాలలోకి రాలేదు.
కేవలం నాగార్జున మాత్రమే సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు.అక్కినేని వెంకట్ సినిమాలలోకి రాకపోవడానికి గల కారణం ఆయనకు సినిమాలంటే పెద్దగా ఇంటరెస్ట్ లేదని అందుకే బిజినెస్ చూసుకుంటారు అని నాగార్జున పలు సందర్భాలలో తన బ్రదర్ గురించి చెప్పుకొచ్చారు.కృష్ణం రాజు నటవారసుడిగా ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ను సంపాదించుకున్నారు.అయితే ప్రభాస్ తమ్ముడు ప్రమోద్ మాత్రం సినిమాలలోకి రాలేదు.
ఈ విషయం పై మాట్లాడిన ప్రభాస్ తన తమ్ముడికి సినిమాలంటే పెద్దగా ఇంటరెస్ట్ లేదని..కానీ ప్రొడ్యూసర్ కావాలని అనుకున్నారు కాబట్టి యువి క్రియేషన్స్ అనే బ్యానర్ ను స్టార్ట్ చేసి మంచి సినిమాలు నిర్మిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.ఇక డి రామానాయుడు నటవారసుడిగా వెంకటేష్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన కంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.అయితే వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు మాత్రం సినిమాలలోకి రాలేదు.ఈ విషయం మీద ఒకసారి ఇంటర్వ్యూ లో మాట్లాడిన సురేష్ బాబు నాన్న నన్ను ప్రొడ్యూసర్ ను,తమ్ముడిని హీరో చేయాలనీ అనుకున్నారు.బహుశా నాన్న నన్ను హీరోను చేయాలనీ అనుకోకపోవడం వలనే నేను హీరోను కాలేదేమో అంటూ ఫన్నీ గా చెప్పుకొచ్చారు.