Neelima Rani: తమిళ్ హీరో కార్తీ కి తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.కార్తీ నటించిన పలు సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి.దాంతో కార్తీ సినిమాలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.ఇలా సూపర్ హిట్ అయిన సినిమాలలో నా పేరు శివ( Naa Peru Shiva ) సినిమా కూడా ఒకటి.కార్తీ కి జంటగా ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది.తమిళ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీ( Karthi ) యుగానికి ఒక్కడు అనే సినిమాతో తెలుగు లో మంచి సూపర్ హిట్ ను అందుకున్నారు.
ఆ తర్వాత కార్తీ నటించిన పలు సినిమాలు తెలుగులో మంచి విజయం సాధించాయి.అలా వచ్చిన సినిమాలలో ఆకట్టుకునే కథతో వైవిధ్యం గా ఉన్న సినిమా నా పేరు శివ.ఈ సినిమాతో కార్తీ నటన పరంగా మంచి గుర్తింపును అందుకున్నారు.
ఇక ఈ సినిమాలో కార్తీ స్నేహితురాలిగా నటించిన నటి అందరికి గుర్తుండే ఉంటుంది.ఈ నటి పేరు నీలిమ రాణి.ఈమె తమిళ్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది అని చెప్పచ్చు.చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన నీలిమ రాణి ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్ గా కూడా చేసింది.
కమల్ హాసన్ నటించిన క్షత్రియ పుత్రుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నీలిమ రాణి.సహాయ నటిగా ఈమె పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఈమె తన ఫ్యామిలీ తో కలిసి దిగిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.