Bindaas Movie: షాక్ అయ్యేలా మారిపోయిన బిందాస్ సినిమా హీరోయిన్..!

Bindaas Movie

Bindaas Movie: ఇప్పటి వరకు టాలీవుడ్ లో హీరో మంచు మనోజ్ నటించిన సూపర్ హిట్ సినిమాలలో బిందాస్ సినిమా కూడా ఒకటి అని చెప్పచ్చు.ఈ సినిమాలో మనోజ్ నటనకు కామెడీ టైమింగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.మూడు కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా ఎనిమిది కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమాలో హీరో మంచు మనోజ్ కు జోడిగా నటించిన హీరోయిన్ కూడా అందరికి గుర్తుండే ఉంటుంది.ఈ ముద్దుగుమ్మ పేరు షీనా శహబాది.బిందాస్ సినిమాలో షీనా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.ఇక బిందాస్ సినిమా తర్వాత షీనా పలు సినిమాలలో నటించడం జరిగింది.

తెలుగులో షీనా నందీశ్వరుడు,యాక్షన్ త్రీడి,నువ్వే నా బంగారం,గడ్డం గ్యాంగ్ అనే పలు సినిమాలలో నటించడం జరిగింది షీనా.ఈమె తెలుగు తో పాటు పలు హిందీ సినిమాలలో కూడా నటించింది.ఇక సినిమాల తర్వాత షీనా పలు సీరియల్స్ లో కూడా నటించినట్లు సమాచారం.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న షీనా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే షీనా తన ఫోటోలను ఎల్లప్పుడూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇక తాజాగా కూడా షీనా షేర్ చేసిన కొన్ని ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంన్నాయి.ఈ ఫోటోలలో షీనా ను చుసిన నెటిజన్లు ఇప్పటికి ఎంతో అందంగా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *