Sr NTR: అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారి పెళ్లి ఎక్కడ జరిగిందో తెలుసా..వైరల్ అవుతున్న పెళ్లి పత్రిక.!

Sr NTR
Sr NTR

Sr NTR: వివాహము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాల ప్రత్యేకమైనది.అందుకే వివాహానికి చెందిన ప్రతి చిన్న గుర్తును ఎంతో జాగ్రత్తగా దాచుకుంటారు చాల మంది.తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్వర్గీయ ఎన్టీఆర్ బసవతారకం ల పెళ్లి శుభలేఖ అందరిని ఆకట్టుకుంటుంది.నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అంటే తెలుగు ప్రజలకు ఎప్పటికి గుర్తుండిపోయే పేరు.తెలుగు ప్రజల ఆరాధ్యదైవంగా భావించే ఎన్టీఆర్ గారు అప్పటి తరానికి కాదు..ఇప్పటి తరం వాళ్ళకి కూడా ఓ రోల్ మోడల్ అని చెప్పచ్చు.ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో రాజకీయ చైతన్య తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ గారిది అని చెప్పచ్చు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ప్రత్యేక స్తానం,ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది.ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది చాల ముఖ్యమైన ఘట్టం.అప్పటి వరకు ఒకలా ఉన్న జీవితం వివాహం తర్వాత పూర్తిగా మారిపోవడం జరుగుతుంది.కొత్త ఆశలు,ఆలోచనలు కొత్త బంధాలతో సరికొత్త జీవితం అనేది ప్రారంభం అవుతుంది.అందుకే పెళ్లి కి సంబంధించిన ఏ గుర్తులు అయినా ప్రతి ఒక్కరి జీవితం లో చాల ప్రత్యేకం.నందమూరి తారకరామారావు గారు మే 2 ,1942 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.

గత రెండేళ్ల నుంచి ఆయన పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ పెళ్లిపత్రికను చూసేందుకు నెటిజన్లు సైతం బాగా ఆసక్తి చూస్పిస్తున్నారు.ఈ పత్రికను పెళ్లి కుమార్తె తండ్రి కాట్రగడ్డ చెంగయ్య ప్రింట్ చేయించారు.ఎన్టీఆర్ గారి అభిమాని ఈ పత్రికకు సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఎన్టీఆర్ గారి మొదటి భార్య బసవతారకం 1985 లో చనిపోయారు.ఆమె పేరు మీద కాన్సర్ హాస్పిటల్ ను నిర్మించి వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *