Balakrishna: ఈ ఫొటోలో బాలయ్య తో ఉన్న ఇద్దరు చిన్నారులు ప్రస్తుతం పెద్ద స్టార్లు..ఎవరో తెలుసా!

Balakrishna

Balakrishna: సినిమా ఇండస్ట్రీ గురించి ముఖ్యంగా నటి నటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎప్పుడు ఎవరికి ఎలాంటి సినిమా అవకాశాలు వస్తాయో ఊహించలేము.సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమా హిట్ తో స్టార్ లుగా ఎదిగినా వాళ్ళు కూడా చాల మందే ఉన్నారు.అలాగే సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్లుగా ఎదిగిన వాళ్ళు కూడా చాల మంది ఉన్నారని చెప్పచ్చు.మహేష్ బాబు,అల్లు అర్జున్,ఎన్టీఆర్,తరుణ్,అఖిల్ ఇలా చాల మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోలుగా చేస్తున్నారు.

అలాగే మీనా,రాశి,హన్సిక,షాలిని వంటి పలు హీరోయిన్ లు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లే.అయితే నందమూరి కళ్యాణ్ రామ్ మరియు రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒకే సినిమాలో నటించడం జరిగింది.బహుశా ఈ విషయం చాల తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.అప్పట్లో నందమూరి బాలకృష్ణ,కోడి రామకృష్ణ దర్శకత్వంలో వంద రోజులు ఆడిన ఆరు సినిమాలు ఉన్నాయి.వీరిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పచ్చు.ఆ హిట్ సినిమాలలో బాలగోపాలుడు సినిమా కూడా ఒకటి.

ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడిగా సుహాసిని నటించడం జరిగింది.ఇక ఇదే చిత్రంలో కళ్యాణ్ రామ్ మరియు రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.ఈ చిత్రంలో వీరిద్దరూ అనాధలుగా నటించారు.ఈ సినిమాలో బాలకృష్ణ వీరిద్దరిని చేరదీసి ఆశ్రమం కల్పిస్తారు.ఇక ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ మరొక సినిమాలో కనిపించలేదు.రాశి మాత్రం తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మాలయంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాల సినిమాలలో నటించారు.ఇక ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వీరిద్దరి పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *