Deepti Bhatnagar: పెళ్ళిసందడి సినిమాలో హీరో శ్రీకాంత్ కళల రాకుమారిగా నటించిన హీరోయిన్ అందరికి గుర్తుండే ఉంటుంది.ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ తన ప్రొడక్షన్ హౌస్ పనులను చూసుకుంటున్నారు.1990 లలో రిలీజ్ అయినా ఈ సినిమా సంచలన విజయం అందుకొని ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది.ఈ సినిమాలో శ్రీకాంత్ కు జోడిగా రవళి,దీప్తి భత్నగర్ లు జోడిగా నటించారు.
ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ రోజు కళలు కనే అమ్మాయి దీప్తి భత్నగర్ ఒకరోజు తన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది.ఆమె తన అందంతో సినిమాలోనూ మరియు నిజజీవితంలోనూ చాల మంది కళల రాకుమారిగా మారిపోయారు అని చెప్పచ్చు.దీప్తి భత్నగర్ తెలుగులో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.ఈ సినిమా తర్వాత ఈమె తెలుగులో పలు హిట్ సినిమాలలో నటించారు.ఆ తర్వాత ఈమె 2002 లో రిలీస్ అయినా కొండవీటి సింహాసనం సినిమా తర్వాత తెలుగు తెరకు దూరం అయ్యారు.
బాలీవుడ్ చిత్ర దర్శకుడు అయినా రణదీప్ ఆర్య ను పెళ్లి చేసుకున్నారు దీప్తి.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటించిన ఈమె 2007 లో వచ్చిన రాకిలిపట్టు అనే మలయాళ సినిమాలో చివరిసారిగా నటించారు.ఈమె ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి పలు టీవీ షోలను నిర్వహించారు.ఈమె సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
View this post on Instagram