indraja: హీరోయిన్ ఇంద్రజ భర్త కూడా మనందరికీ బాగా తెలిసిన నటుడే…ఇంతకీ ఎవరో చూస్తే షాక్ అవుతారు..!

indraja

indraja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లలో హీరోయిన్ ఇంద్రజ కు ప్రత్యేక క్రేజ్ ఉందని చెప్పచ్చు.ఇంద్రజ తన అందంతో,నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.ఇంద్రజ దాదాపుగా 80 కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు.ఇంద్రజ కేరళ లోని ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబం లో జన్మిచారు.ఇంద్రజ అసలు పేరు రజాతి.చదువుకునే రోజులలో ఈమె ఎన్నో నాటక,సంగీత పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులు సొంతం చేసుకున్నారు.ముందుగా ఈమె జంతర్ మంతర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

కానీ అలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన యమలీల సినిమా ముందుగా విడుదల అయ్యి బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలో ఈమె స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంటుంది అనే టైం లో ఆమె తల్లి అనారోగ్యం,ఆ తర్వాత ఆమె పెళ్లి జరగడం వంటివి వెంటనే జరిగిపోయాయి.ఆ తర్వాత పిల్లలు పుట్టడంతో ఇంద్రజ సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోయారు.దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇంద్రజ బుల్లితెర మీద సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు.

ఇంద్రజ తమిళ సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో తన తోటి నటుడు అయినా మహమ్మద్ అబ్సర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అబ్సర్ కేరళకు చెందిన నటుడు.బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన భర్త ముస్లిం అయినా అబ్సర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఇంద్రజ అంటే అబ్సర్ కుటుంబసభ్యులకు బాగా ఇష్టమట.బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఇంద్రజ మాంసం తినదు కాబ్బటి ఆమె కోసం అబ్సర్ కుటుంబం మొత్తం మాంసాహారం తినడం మానేశారట.

ఇంద్రజ అబ్సర్ ను పెళ్లి చేసుకున్న సమయం నుంచి ఇప్పటి వరకు ఇంట్లో మాంసాహారం వండలేదని చాల గర్వంగా చెప్పుకుంటారు నటి ఇంద్రజ.ఎప్పుడైనా బయటకు వెళ్లిన సందర్భాలలో మాంసాహారం తీసుకోవడంలో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఇంద్రజ చెప్పారట.ఇక ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారం అవుతున్న అతి పెద్ద కామెడీ షో జబర్దస్త్ కు జడ్జి గా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *