Prabhas: ప్రభాస్ ఒక్కో సినిమాకు తన డూప్ కు ఇచ్చే పారితోషకం ఎంతో తెలుసా..!

Prabhas

Prabhas: ప్రపంచ వ్యాప్తం గా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న తెలుగు హీరో రెబెల్ స్టార్ ప్రభాస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా అమాంతంగా పెరిగిపోయింది.బాహుబలి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన సంచలనం గురించి అందరికి తెలిసిందే.బాహుబలి సినిమాలో ప్రభాస్ కటౌట్ కు,నటన కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఫాలోయింగ్ పెరిగిపోయింది అని చెప్పచ్చు.ఇక బాహుబలి సంచలన విజయం తర్వాత ప్రభాస్ చేసిన అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలే.అయితే సాహో,రాధేశ్యామ్,ఆదిపురుష్ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.

దాంతో మళ్ళీ సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు ప్రభాస్.దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ తన నటవిశ్వరూపాన్ని చూపించారు.ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్,కల్కి సినిమాలలో నటిస్తున్నారు.ఇది ఇలా ఉంటె తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో బాగా వినిపిస్తుంది.ప్రభాస్ తనకు డూప్ గా నటించే వ్యక్తికీ ఇచ్చే పారితోషకం గురించి ఒక వార్త నెట్టింట్లో వినిపిస్తుంది.

కిరణ్ రాజ్ అనే వ్యక్తి హీరో ప్రభాస్ కు డూప్ గా నటిస్తూందరు.అయితే ఇదివరకు కిరణ్ రాజ్(Kiran Raj) అంటే ప్రేక్షకులకు ఎవరో తెలీదు.కానీ బాహుబలి సినిమా తర్వాత బాగా పాపులర్ అయ్యాడు కిరణ్ రాజ్.అయితే ఇతర హీరోలకు నటించే డూప్ లకు ఆ సినిమా నిర్మాతలే పారితోషకం చెల్లిస్తారు.కానీ ప్రభాస్ తన దగ్గర పనిచేసే వాళ్లకు తానె స్వయంగా పారితోషకం ఇస్తారని సమాచారం.ఇక తనకు డూప్ గా నటించే కిరణ్ రాజ్ అనే వ్యక్తికీ ప్రభాస్ ప్రతి సినిమాకే రూ.30 లక్షలు పారితోషకం ఇస్తారట.

తనకు డూప్ గా నటించే వ్యక్తికీ ప్రభాస్ ఇంత భారీ మొత్తంలో పారితోషకం ఇస్తూ ఉండటంలో ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఆయన అభిమానులు.ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో కల్కి సినిమా చేస్తున్నారు.ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపికా పడుకొనే,దిశా పటాని కీలక పాత్రలలో కనిపించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *