Vijaya Shanti Husband: విజయశాంతి భర్త నందమూరి ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ గురించి మీకు తెలుసా!

Vijaya Shanti Husband: లేడీ సూపర్ స్టార్ విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు నందమూరి ఫ్యామిలీకి రిలేషన్ ఉంది.అయితే ఈ విషయం ఇప్పటి వరకు చాల మందికి తెలిసి ఉండదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయశాంతి లేడీ సూపర్ స్టార్.విజయశాంతి తన యాక్షన్ తో ఒక హిస్టరీని క్రియేట్ చేసారు.హీరోయిన్ గా కెరీర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలోనే ఈమె శ్రీనివాస్ ప్రసాద్ ను పెళ్లి చేసుకున్నారు.శ్రీనివాస్ ప్రసాద్ నందమూరి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కావడం విశేషం అని చెప్పచ్చు.యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలతో ఈమె లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్నారు.పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు గ్లామర్ పాత్రలు ఉన్న సినిమాలలో కూడా తన సత్తా చాటారు విజయశాంతి.

ప్రేక్షకుల చేత విశ్వ నట భారతిగా పేరుతెచ్చుకున్నారు.1964 లో జన్మించిన ఈమె అసలు పేరు శాంతి.సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన పిన్ని విజయలలిత పేరు నుంచి విజయ ను తీసుకున్నారు.కళుక్కుళ్ యీరం అనే సినిమాతో ఈమె మొదటి సారిగా ఎంట్రీ ఇచ్చారు.కిలాడీ కృష్ణుడు అనే సినిమాతో తెలుగులో మొదటి సారి కనిపించరు విజయ శాంతి.కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేసిన ఈమెకు నేటి భరతం సినిమాతో నటిగా మంచి గుర్తింపు లభించింది.

అప్పట్లో ఈ సినిమా విజయశాంతికి మంచి బ్రేక్ ఇచ్చింది.తన కెరీర్ లో విజయశాంతి ఎక్కువగా చిరంజీవి,బాలకృష్ణ,కృష్ణ లతో నటించారు.ఇక ఈమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఎన్టీఆర్ పెద్దల్లుడు.గణేష్ రావు కు ఈయన మేనల్లుడు అవుతారు.శ్రీనివాస్ ప్రసాద్ కు బాలకృష్ణ కు మంచి ఫ్రెండ్ షిప్ ఉండేది.ఈ ఫ్రెండ్ షిప్ తోనే బాలకృష్ణతో కలిసి యువరత్న ఆర్ట్స్ ను స్థాపించి ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో నిప్పురవ్వ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమాలో చాల హీరోయిన్లను పరిశీలించిన తర్వాత విజయశాంతిని నటింపజేయడానికి శ్రీనివాస్ ప్రసాద్ స్వయంగా ఆమె దగ్గరకు వెళ్లారట.అప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.

Leave a Comment