Hema Husband: నటి హేమ భర్త ఎలా ఉంటారో…ఏం చేస్తారో తెలుసా…!

Hema Husband
Hema Husband

Hema Husband: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీమణులలో హేమ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాతో హేమ ఉత్తమ్ హాస్య నటిగా అవార్డును కూడా సొంతం చేఉకున్నారు.ఇప్పటి వరకు ఈమె 250 కి పైగా సినిమాలలో నటించారు.1989 లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా హేమ ఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సీనియర్ నటీమణులలో హేమ గారికి ప్రత్యేక క్రేజ్ ఉంది అని చెప్పచ్చు.సినిమాల్లోకి రాకముందు ఆమె పేరు కృష్ణ వేణి.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక ఆమె హేమ గా పేరు మార్చుకున్నారు.తెలుగుతో పాటు ఆమె తమిళ్,మలయాళ సినిమాలలో కూడా నటించారు.ఇక బుల్లితెర మీద ప్రసారం అయినా అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 లో ఆమె ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసారు.

ఈమె జూన్ 1 ,1967 ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు.నటన అంటే ఆసక్తి ఉండడంతో ఈమె క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు.హేమ జాన్ అహ్మద్ ను పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు ఇషా మరియు సామ్ అనే సంతానం ఉన్నారు.తెలుగు సినిమాలలో ముఖ్యం బ్రమ్మానందం కు జోడిగా అమాయకమైన భార్య పాత్రలో ఈమెకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పచ్చు.చాల సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.ప్రస్తుతం హేమ తన భర్త మరియు పిల్లలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *