Actress Gajala: సినిమా ఇండస్ట్రీ అనే ప్రపంచంలో అడుగు పెట్టిన తర్వాత అవకాశాలు వచ్చే వరకు ఒక బాధ అయితే అవకాశలు వచ్చాక మరొక బాధ ఉంటుంది.సినిమాలలో నటించే వాళ్ళను అందరు గుర్తుపెట్టుకుంటారు.అయితే వాళ్లలో చాల మంది ఓవర్ నైట్ లో స్టార్స్ అయినా వాళ్ళు కూడా ఉంటారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనసును దోచిన హీరోయిన్లు చాలానే ఉన్నారు అని చెప్పచ్చు.అలా ఒక సినిమాతో పేరు తెచ్చుకున్న తర్వాత ఆ పేరును నిలబెట్టుకోవడం కూడా చాల కష్టం అని చెప్పచ్చు.అలా ఒక సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత కనుమరుగైపోయిన హీరోయిన్లలో గజాల కూడా ఒకరు అని చెప్పచ్చు.
సినిమాల్లోకి రాకముందు ఆమె అసలు పేరు రాజి.ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె గజాల గా మార్చుకున్నారు.జగపతి బాబు హీరోగా 2001 లో రిలీజ్ అయినా నాలో ఉన్న ప్రేమ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది గజాల.
ఆ తర్వాత తెలుగులో కలుసుకోవాలని,స్టూడెంట్ నెంబర్ వన్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ అమ్మడు.తెలుగులో ఈమె దాదాపుగా 30 సినిమాలలో నటించడం జరిగింది.ఆ టైం లోనే టాలీవుడ్ కు చెందిన ఒక యంగ్ హీరోతో ప్రేమలో పడటం ఆ తర్వాత అతను మోసం చేశాడంటూ ఆత్మహత్య ప్రయత్నం చేయడం అప్పట్లో దుమారం లేపిన విషయం.
అదే సమయంలో సీనియర్ హీరో అర్జున్ ఆమెను సేవ్ చేసి అన్ని విధాలా ఆసరాగా ఉన్నారనే వార్త కూడా వినిపించింది.ఇక గజాల 2011 లో రిలీజ్ అయినా మనీ మనీ మోర్ మనీ సినిమాలో చివరగా కనిపించడం జరిగింది.ఈమె టీవీ నటుడు అయినా ఫైజల్ రాజా ఖాన్ ను 2016 లో పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం గజాల ముంబై లో ఉంటుందని సమాచారం.అయితే ప్రస్తుతం ఈమె తన భర్త దర్శకత్వంలో సీరియల్స్ లో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
View this post on Instagram