JAWA 350: ఇండియా లో ఆటో మొబైల్ రంగం రోజు రోజుకు ఒక అడుగు ముందుకు వెళుతుంది.తాజాగా ఒక కొత్త బులెట్ ఇండియా లో అందుబాటులోకి వచ్చింది.ఇండియా లో జావా యేజ్ది మోటార్ సైకిల్స్ ఒక కొత్త బులెట్ జావా 350 ని విడుదల చేసారు.
దీని ఎక్స్ షో రూమ్ ధర రూ.2 ,14 ,950 .ఇండియా లో ప్రస్తుతం జావా 350 అందుబాటులో ఉన్న,అత్యంత వేగవంతమైన,బెస్ట్ బ్రేకింగ్,సురక్షితమైన క్లాసిక్ మోటార్ సైకిల్ గా పేరుపొందింది.రూ.5 వేల తో జావా 350 బులెట్ ను టెస్ట్ డ్రైవ్ కోసం ఆన్లైన్ లో బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.
రిఫండబుల్ మనీ అని కూడా యాజమాన్యం చెప్పుకొచ్చారు.ఇక ఈ బైక్స్ లో మేరుం,మిస్టిక్ ఆరంజ్,బ్లాక్ మూడు కలర్స్ అందుబాటులోకి వచ్చాయి.334 cc ఇంజిన్,22 .5 PS మాక్సిమం పవర్,28 .1 Nm మాక్సిమం టాక్ ఈ బైక్ ఫీచర్స్.
ఇక ఈ బైక్ లో మిర్రర్ ఫినిష్ క్రోమ్ ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది అని తెలిపారు.13 .2 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉన్న ఈ బైక్ కు ఫ్రంట్,రియర్ కూడా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.డ్యూయల్ ఛానల్ ABS కూడా ఈ బైక్ కు ఉంది.అనలాగ్ ఓడోమీటర్,ఒక సిలిండర్ ఈ బైక్ కు ఉన్నాయి.అనలాగ్ స్పీడోమీటర్,అనలాగ్ ట్రిప్ మీటర్ కూడా ఉన్నాయి.