LIC Saral Pension Plan: ఎల్ఐసి లో ఉన్న ఈ ప్లాన్ లో చేరితే రూ.1 లక్ష పెన్షన్ పొందవచ్చు..పూర్తి వివరాలు తెలుసుకోండి…!

LIC Saral Pension Plan: మనదేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా కి ప్రజలలో బాగా నమ్మకం ఉంది.చాల రకాల కంపెనీ లో వివిధ పథకాలు మన దేశం లో ఉన్నప్పటికీ ప్రజలు ఎల్ఐసి లో మాత్రమే చేరేందుకు ఆసక్తిని చూపిస్తారు.కేంద్ర ప్రభుత్వం భరోసా తో పాటు అన్ని రంగాలలో ఉన్న ప్రజలకు అవసరమైన పథకాలు ఇందులో ఉంటాయి.జీవిత భీమా తో పాటు చాల రకాల పథకాలు ఇందులో చూడచ్చు.

అలా ప్రస్తుతం ఉన్న ప్లాన్ లలో ఎల్ ఐ సి సరళ పెన్షన్ ప్లాన్ ఒకటి.2022 ఆగష్టు లో స్టార్ట్ అయినా ఈ ప్లాన్ ఇన్స్టంట్ యాన్యుటీ ప్లాన్.ప్రారంభం నుంచి దాదాపు 5 శాతం యాన్యుటీ హామీ అందిస్తున్న ఈ ప్లాన్ నాన్ లింక్డ్,నాన్ పార్టిసిపేటింగ్ అప్ ఫ్రంట్ సింగల్ ప్రీమియం.నెలవారీ,త్రైమాసికం,అర్ధ వార్షికం లేదా వార్షికం లో చెల్లింపులు పొందవచ్చు.40 నుంచి 80 ఏళ్ళ మధ్యలో ఉన్న వారు ఎవరైనా కూడా ఈ ప్లాన్ ను కొనుగోలు చేసుకోవచ్చు.

ఎల్ ఐ సి అధికారిక వెబ్సైటు వివరాల ప్రకారం పాలిసీదారు సరళ పెన్షన్ ప్లాన్ లో కనీసం నెలకు రూ.1000 లేదా వార్షికం రూ.12000 పొందవచ్చు.ఒక వ్యక్తి ఈ కనీస పెన్షన్ పొందటానికి ఒకేసారి రూ.2 .50 లక్షలు సింగల్ ప్రీమియం చెల్లించాలి.10 లక్షలు సింగల్ ప్రీమియం చెల్లించినట్లయితే వార్షికంగా రూ.50 ,250 పెన్షన్ పొందుతారు.

అలాగే 20 లక్షలు ప్రీమియం చెల్లిస్తే రూ.1 లక్ష వార్షిక పెన్షన్ పొందుతారు.ప్రారంభించిన ఆరు నెలల తర్వాత లోన్ సౌకర్యం ఉంటుంది.ఆరు నెలల తర్వాత ఈ స్కీం నుంచి తప్పుకోవచ్చు.దాదాపు 5 శాతం వార్షిక రాబడి హామీ ఇస్తుంది ఈ ప్లాన్.ఇది జీవిత పాలిసీ కాబట్టి స్టార్ట్ చేసిన తర్వాత జీవితాంతం నెలవారీ లేదా వార్షిక పెన్షన్ పొందుతారు.పాలిసీదారు మరణించినట్లయితే బేస్ ప్రీమియం నామిని కి చెల్లించటం జరుగుతుంది.

Leave a Comment