Bank Account: కొంత మందికి వివిధ బ్యాంకులలో ఖాతాలు ఉంటాయి.అయితే వారిలో కొంత మంది ఖాతాలు ఉన్నప్పటికీ కెవైసి పూర్తి చేయరు.అలాగే బాలన్స్ కూడా మైంటైన్ చేయరు.అలా చేసే వారికి ఆ సంబంధిత బ్యాంకులు చర్యలు చేపడుతున్నాయి.పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఖాతాలు ఉన్న వారికి జూన్ 30 లోగా ఆ పనిని పూర్తి చేయకపోతే వారి ఖాతాలు మూసివేస్తామని ఇప్పటికే బ్యాంకు నోటీసులు పంపడం జరిగింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు లు ఖాతాలు ఉన్న కోట్లాది మందికి ఇది బిగ్ అలెర్ట్ అన్ని చెప్పవచ్చు.మరో మూడు నాలుగు రోజులలో జూన్ 30 సమీపిస్తోంది.ఈ బ్యాంకు లో ఖాతా ఉన్న వారు మీ ఓపెరేటివ్ ఖాతాను ఆక్టివ్ గా ఉంచుకోవాలి అని అనుకుంటే వెంటనే జూన్ 30 లోగా ఈ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది.చాల కాలం నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు లో ఖాతాను ఉపయోగించని కస్టమర్లకు ఇప్పటికే బ్యాంకు నోటీసులు పంపించటం జరిగింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు తమ బ్యాంకు లో గత మూడేళ్ళ నుంచి ఖాతాలలో ఎటువంటి లావాదేవీలు జరగని,జీరో బాలన్స్ ఉన్న ఖాతాలపై చర్యలు తీసుకుంటుంది.అందుకని ఈ బ్యాంకు లో ఖాతాలు ఉన్న వారు వెంటనే మీ ఖాతాను తనిఖీ చేసుకొని దానికి సంబంధించిన కెవైసి ని జూన్ 30 లోగా పూర్తి చేయండి.లేకపోతె జులై 1 నుంచి ఖాతాలు మూసివేయబడతాయి అని బ్యాంకు ఇప్పటికే ప్రకటించటం జరిగింది.ఇప్పటికే అలంటి ఖాతాలు ఉన్న వారికి బ్యాంకు నోటీసులు పంపడం జరిగింది.నోటీసులు పంపిన ఒక నెల తర్వాత ఆ ఖాతాలు మూసివేయబడతాయి.