Tomato Price: మొన్నటి వరకు టమాటా ధరలు మార్కెట్ లో ఓ మోత మోగించాయి.సెంచరీ కొట్టి సామాన్యులు టమాటా కొనాలంటే భయపడేలా చేసాయి.ఇక ఆ తర్వాత కొద్దిగా దిగొచ్చిన టమాటా ధరలు అరవై రూపాయలు అలాగే ఆ తర్వాత నలభై రూపాయల వరకు ఉన్నాయి.మారుతున్నా మార్కెట్ పరిస్థితులలో కొంత కాలంగా కొద్దీ కొద్దిగా దిగొచ్చిన టమాటా ధరలు ఎవరు ఊహించని రేంజ్ లో ఒక్కసారిగా పతనమయ్యాయి.
మొన్నటి వరకు కిలో వందరూపాయలు ఉన్న టమాటా ధర ఇప్పుడు ఒక్క రూపాయికి పడిపోయి రైతులతో పాటు అందరికి షాక్ కు గురిచేస్తున్నాయి.కర్నూల్ జిల్లాలోని పత్తికొండ మార్కెట్ లో టమాటా ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఒక్క రూపాయికి పడిపోయాయి.కిలో టమాటా ఒక్కసారిగా రూపాయికి పడిపోవటంతో రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు.తెచ్చిన టమాటాలు కొనడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోతున్నారు రైతులు.అయితే పలు ప్రాంతాల నుంచి టమాటా పంట దిగుబడి ఎక్కువగా ఉండటం టమాటా ధరలు పడిపోవడానికి కారణం అంటూ పలు రైతులు చెప్తున్నారు.