Mahalakshmi Scheme: తెలంగాణ ప్రజలకు డబుల్ గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం…కొత్త రేషన్ కార్డుతో పాటు ప్రతి నెల 2500 రూపాయలు..!

Mahalakshmi Scheme: తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాలకు పుట్టినిల్లుగా మారిపోయిన సంగతి తెలిసిందే.సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి చేసే క్రమంలో ఒక్కొక్కటిగా అన్ని పథకాలను అమలులోకి తీసుకోని వస్తున్నారు.ఎన్నికలలో గెలిచినా తర్వాత సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మహిళకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించారు.

అలాగే పెదాలను ఆడుకుంటున్న ఆరోగ్య శ్రీ ట్రీట్మెంట్ లిమిట్ ను 10 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే.అలా సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కి జనాల్లో పాసిటివిటి ఏర్పడింది.ఇక రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు మరియు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కూడా అందుబాటులోకి తీసుకోని వచ్చారు.

ఈ రెండు పథకాలు మార్చ్ 1 నుంచి అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పుడు తాజాగా పేద మహిళలకు 2500 రూపాయలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం జులై లేదా ఆగష్టు నుంచి ఈ పథకం అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది.ఇక తెల్ల రేషన్ కార్డు కీలకం అయినా ఈ పథకంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటి సర్వే చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల 2500 రూపాయలు ఇవ్వబోతున్నట్లు తెలిపింది.

ఈ మహాలక్ష్మి పథకంలో తెల్ల రేషన్ కార్డు కీలకం అయినందువల్ల ప్రభుత్వం ముందుగా ఈ తెల్ల రేషన్ కార్డును మంజూరు చేసి ఆ తర్వాత మహిళలకు 2500 రూపాయలు అందిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే 18 ఏళ్ళు నిండి వేరే ఇతర ప్రభుత్వ పెన్షన్ లభించని పేద మహిళలకు మాత్రమే ఈ పథకం లభిస్తుంది.

Leave a Comment