PAN Card: ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ కార్డు తో పాటు పాన్ కార్డు కూడా ఎంతో ముఖ్యమైనది.బ్యాంకు ఖాతాలో వివిధ లావాదేవీలకు అలాగే పన్ను చెల్లింపులకు పాన్ కార్డు తప్పని సరి అన్న విషయం తెలిసిందే.ఇక ఆర్ధిక మోసాలు నిరోధించడంలో కూడా ఈ పాన్ కార్డు ప్రభుత్వానికి చాల ఉపయోగపడుతుంది.ఇప్పటికే చాల సార్లు ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డు ను ఆధార్ కార్డు తో లింక్ చేయాలనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.దానికి సంబంధించి గడువును కూడా చాల సార్లు పెంచడం జరిగింది.ఇక పాన్ కార్డు ను ఆధార్ కార్డు తో లింక్ చేసే చివరి తేదీ డిసెంబర్ 31 ,2024 .మీ పాన్ కార్డు ను ఆధార్ కార్డు తో లింక్ చేయకపోతే పాన్ కార్డు డి ఆక్టివేట్ అవుతుంది.
ఇదా లావాదేవికి సంబంధించిన సమస్యలను కూడా కలిగిస్తుంది.ఈ టెక్నాలజీ యుగంలో ఆర్ధిక మోసాలు రోజు రోజులు పెరిగిపోతున్నాయి.అనేక కంపెనీలు కస్టమర్ ప్రొఫైల్ లను రూపొందించటానికి అనధికారిక పద్ధతిలో ఈ పాన్ వివరాలను ఉపయోగిస్తున్నారు అని ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి.దీనిని దృష్టిలో పెట్టుకొని హోమ్ మంత్రిత్వ శాఖ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా పాన్ ద్వారా వ్యక్తిగత వివరాలకు యాక్సిస్ పరిమితం చేయాలనీ ఆదేశించింది.అందుకే ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డు ను ఆధార్ కార్డు తో లింక్ చేయడం తప్పని సరి చేసింది.గడువు తేదీ లోపు మీ పాన్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ కాకపోతే మీ పాన్ కార్డు డి ఆక్టివేట్ అవుతుంది.