Rs. 2000 Notes: కేంద్ర ప్రభుత్వం 2016 లో పెద్ద నోట్లు రూ.500 మరియు రూ.1000 నోటును రద్దు చేసిన సంగతి అందరికి తెలిసిందే.ఆ సమయంలో పెద్ద నోట్ల కరెన్సీని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోటును అందుబాటులోకి తెచ్చింది.ఆ తర్వాత కరెన్సీ డిమాండ్ సాధారణ స్థాయికి రావడంతో ఆర్బీఐ 2018 -19 లో ఈ నోట్ల ముద్రను నిలిపివేసింది.ఈ రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ చాల సార్లు ప్రకటించింది.దీనికి సంబంధించి చాల సార్లు గడువును కూడా పెంచింది.
అయితే ఇప్పటికి ప్రజల దగ్గర రెండు శాతం ఈ నోట్లు ఉన్నట్లు ఆర్బీఐ ఇటీవల ఒక నివేదిక ప్రకటించింది.దాంతో మరోసారి ఈ నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ ఒక సులభమైన ప్రక్రియను తెలిపింది.దాని కోసం ఆర్బీఐ అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫార్మ్ అధర్స్ లో అప్లికేషన్ ను ఫిల్ చేసి ఆ అప్లికేషన్ తో పాటు మీ బ్యాంకు వివరాలను దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లో అందజేయాలి.మీ అప్లికేషన్ ను పరిశీలించిన తర్వాత డబ్బు మీ బ్యాంకు ఖాతాలో సురక్షితంగా జమ చేయబడుతుంది.