Mouth Ulcers: నోట్లో పుండ్లతో ఇబ్బంది పడుతున్నారా…ఈ చిన్న చిట్కాతో ఒక్క రోజులో తగ్గించుకోండి…!

Mouth Ulcers
Mouth Ulcers

Mouth Ulcers: సాధారణంగా చాల మందికి అప్పుడప్పుడు నోట్లో పుండ్లు వంటివి చాల ఇబ్బంది పెడుతుంటాయి.పుండ్లు ఎక్కువగా శరీరంలో అధికంగా వేడి ఉన్నా,కారం,మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారా పదార్థాలను తిన్న,ఒక్కోసారి వేడి వేడి పదార్థాలను తిని నోరు కాలిన,ఇలా కొన్ని కారణాల వలన నోట్లో పుండ్లు అనే ఏర్పడతాయి.అవి కొన్ని సార్లు పెదవుల లోపలి వైపు,నాలుక మీద ఏర్పడి చాల ఇబ్బందికి గురి చేస్తుంటాయి.అయితే ఇలా నోట్లో ఏర్పడే పండ్లను కేవలం ఒక్క రోజులోనే ఒక చిన్న చిట్కాతో నయం చేసుకోవచ్చు.

మన వంటింట్లో ఉండే పసుపుతో ఈ పండ్లను నయం చేసుకోవచ్చు.అది ఎలా అంటే…కొంచెం పసుపును తీసుకోని దాంట్లో కొంచెం నీటిని కలిపి పేస్ట్ ల తయారుచేసుకోవాలి.రాత్రి పూట ఆ పేస్ట్ ను నోట్లో పుండ్లు ఉన్న చోట రాయాలి.ఆ మరుసటి రోజు ఉదయం దంతాలను తోముకోవాలి.ఇలా ఒక్క రోజు రాత్రి పేస్ట్ అప్లై చేస్తే చాలు నొప్పి,మంట నుంచి ఉపశమనం పొందవచ్చు.రెండో రోజు కూడా ఇలా చేసి నట్లయితే పుండ్లు తగ్గిపోతాయి.

ఇలా నోట్లో ఏర్పడే పుండ్లకు ఇది చాల అత్యుత్తమ చిట్కాగా పనిచేస్తుంది.పసుపులో యాంటీ బయాటిక్,యాంటీ వైరల్,యాంటీ ఇంఫ్లామేటరీ గుణాలు ఎక్కువగా ఉండడం వలన అది పుండ్లను త్వరగా నయం చేస్తుంది.కాబట్టి పసుపుతో ఇలా చేయడం వలన నోట్లో పుండ్లతో పాటు శరీరం మీద గాయాలు వంటివి కూడా త్వరగా నయం అవుతాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *