Sukumar Daughter: ఒకప్పుడు సినిమా సెలెబ్రెటీలు వారి ఫ్యామిలీ మెంబెర్స్ ఎలా ఉన్నారో తెలిసేది కాదు.సినిమా పత్రికల్లో,మ్యాగజిన్ లలో వాళ్ళ ఫోటోలు వస్తే చూసే వాళ్ళు అందరు.ఇక సెలెబ్రెటీలు ఎవరిని పెళ్లి చేసుకున్నారు.వాళ్లకు యెంత మంది పిల్లలు ఉన్నారు అనే విషయాలు కూడా ఎవరికి తెలిసేవి కాదు.కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సినీ సెలెబ్రెటీల సినిమాల నుంచి వాళ్ళ పర్సనల్ విషయాల వరకు అందరికి క్షణాలలో తెలిసిపోతుంది.
అప్పట్లో సినిమా సెలెబ్రెటీలకు చాల స్వేచ్ఛ ఉండేది అని చెప్పచ్చు.కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరైనా సెలెబ్రెటీలు వాళ్ళ ఫ్యామిలీతో బయట కనిపిస్తే చాలు తమ చేతుల్లో ఉన్న ఫోన్ లకు పని చెప్పి ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్త క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి.
దాంతో సినిమా సెలెబ్రెటీల పిల్లలను అందరు గుర్తుపట్టేస్తున్నారు.మరికొంత మంది సెలెబ్రెటీలు తమ ఫ్యామిలీ ఫోటోలను వాళ్ళే సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.పైన ఫొటోలో కళ్ళజోడు పెట్టుకొని మోడరన్ లుక్ లో అమ్మాయి టాలీవుడ్ లో ఒక ఫేమస్ డైరెక్టర్ కూతురు.
ఈమె తండ్రి ఇప్పటికే టాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ సినిమా లు చేసారు.ఈయనతో సినిమాలు చేయడానికి హీరోలు కూడా ఎదురు చూస్తుంటారు.ఆయన ఎవరో కాదు డైరెక్టర్ సుకుమార్.ఈ పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి సుకుమార్ కూతురు సుకృతి వేణి.
సుకృతి తాజాగా తన 14 వ పుట్టిన రోజును జరుపుకుంది.ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సుకృతి తల్లి తబిత సోషల్ మీడియా లో షేర్ చేసారు.ప్రస్తుతం హైదరాబాద్ స్కూల్ లో చదువుతున్న సుకృతి మంచి సింగర్.చిన్నప్పటి నుంచి సుకృతి కి పాటలు పాడటం అంటే చాల ఇష్టం.ఇక సుకుమార్ గురించి చెప్పాలంటే పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.