S. S. Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ కమెడియన్ గా ఎదిగిన వాళ్లలో సునీల్ కూడా ఒకరు.ఒకవైపు కమెడియన్ గా పాత్రలు చేస్తూనే హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.తనదైన నటనతో కమెడియన్ గా,హీరోగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు సునీల్.అలా హీరోగా సునీల్ కు బాగా గుర్తింపు తీసుకొచ్చిపెట్టిన సినిమా మర్యాద రామన్న.
రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా చేసారు మర్యాద రామన్న సినిమాలో.1 .20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబడిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి 4 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.అయితే ఈ సినిమాలో హీరో సునీల్ కొబ్బరిబోండాలు కొనే సీన్ లో ఈ మిస్ టెక్ ను ప్రతి ఒక్కరు గమనించే ఉంటారు.
ఈ సీన్ లో సునీల్ కొబ్బరిబోండాలు కొనే సమయంలో ట్రైన్ డోర్ నుంచి మూడవ కిటికీ దగ్గర ఉన్నట్లు చూపిస్తారు.అదే తర్వాతి సీన్ లో వెంటనే డోర్ పక్కనే ఉన్న కిటికీ దగ్గర సునీల్ ఉన్నట్లు చూపిస్తారు.కిటికీ ఊచలు కూడా చాల తేడాగా ఉన్నట్లు చూపించడం జరుగుతుంది.సినిమాలలో ఇది సర్వసాధారణం అయినప్పటికీ కూడా మిస్ టెక్ మిస్టేకే కదా.ఈ చిన్న మిస్ టెక్ ను సినిమా చూసిన వాళ్ళు చాల మంది గుర్తించే ఉంటారు.