Panjaa Movie: షాక్ అయ్యేలా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..!

Panjaa Movie: పవర్ స్టార్ పవన్ ‌కల్యాణ్ నటించిన పంజా మూవీ గుర్తుండే ఉంటుంది. ఇందులో డిఫరెంట్ లుక్‌తో పవన్ కల్యాణ్ కనిపించారు. గడ్డం, కరుకు దనం నిండిన చూపులతో పవర్ ఫుల్‌ క్యారెక్టర్ చేశారు. ప్రత్యేక పాత్రలో అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ మూవీ 2011లో విడుదలైంది. దీనికి విష్ణువర్ధన్ డైరెక్టర్‌గా పనిచేశారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసారనే చెప్పాలి. మెలోడీ ట్యూన్స్‌తో శ్రోతల్ని మంత్రముగ్దుల్ని చేసేసారు. ఒక్కో పాట దేనికదే ప్రత్యేకతను సంతరించుకున్నది. అన్ని పాటలూ సూపర్ హిట్ టాక్ అందుకున్నా్యి.

జాకీష్రాఫ్, అడివి శేష, అతుల్ కులకర్ణి తదితరులు ఈ మూవీలో నటించారు.పంజా మూవీ పవన్ కెరీర్‌లో ఓ బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ప్రేక్షకాదరణ పొందింది. ప్రత్యేక కథాంశంతో తెరకెక్కిన మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ అంచనాలు ఉన్నా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. కానీ మూవీ పవన్ నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పక తప్పదు. ఇందులో పవన్ కల్యాణ్‌కు జంటగా సారా జేన్ డయాస్ నటించారు. అంజలి లావానియా మరో హీరోయిన్‌గా పవన్ సరసన నటించారు.

అంజలి ఈ మూవీలో బోల్డ్‌గా కనిపించి కుర్రకారును కైపెక్కించింది. తన అందచందాలతో ఇండస్ర్టీ ద‌ృష్టి తనపై పడేలా చేసుకుంది. గ్లామరస్ పాత్రలో యువతను కట్టిపడేసిన అంజలి ప్రస్తుతం ఏం చేస్తోంది..? ఎలా ఉంది..? అనే విషయాలు చాలా మందికి తెలియవు. నెట్‌లో సెర్చ్ చేసినా సమాచారం పెద్దగా లభించదు. అంజలి ఓ మోడల్ అన్న విషయం తెలిసిందే. తన సినీ ప్రయాణంలో కేవలం ఒకే ఒక్క మూవీ చేసింది. అది పంజా సినిమా మాత్రమే. 2012లో వోగ్ విడుదల చేసిన టాప్ 10 మోడల్స్ లిస్టులో అంజలి స్థానాన్ని సంపాదించుకున్నారు.అంజలి పలు సందర్భాల్లో ర్యాంప్ వాక్ చేసి తన అందచందాలతో మంత్రముగ్దుల్ని చేసింది.

అందాల పోటీల్లో డిఫరెంట్ లుక్‌లో అభిమానుల్ని ఆకట్టుకునేది. అంజలి లావానియా చక్ర హీలింగ్‌తోపాటు క్రియా యోగా వైద్యం చేయడంలో సిద్ధహస్తురాలు. ఇందు కోసం కొన్నేళ్లు ఫిల్మ్ ఇండస్ర్టీకి దూరంగా ఉంది. ఆ తరువాత సైతం ఆమె పెద్దగా నటన పట్ల ఆసక్తి కనబర్చలేదు. క్రమంగా ఇండస్ర్టీకి దూరమయ్యారు. డీజేగా అభిమానుల్ని అలరిస్తున్నారు. మరో వైపు సోషల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటి కప్పుడు ఆమె పోస్ట్ చేసే ఫొటోలు నెట్టింట్ హల్ చల్ చేస్తుంటాయి. ప్రస్తుతం తన అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకున్న అంజలి హాటెస్ట్ లేటెస్ట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anjali Lavania (@anjelli_luvania)

Leave a Comment