Ottesi Cheputunna: ‘ఒట్టేసి చెపుతున్న’ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ను గుర్తుపట్టగలరా…ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా..!

Ottesi Cheputunna
Ottesi Cheputunna

Ottesi Cheputunna: ఈ ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఒకప్పుడు తెలుగు సినిమాలో నటించి తన అందంతో నటనతో మంచి గుర్తింపును తెచ్చుకుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమయంలోనే ఈమె సడన్ గా పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యింది.ప్రస్తుతం ఈమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను,వీడియోలను షేర్ చేస్తుంది.

ఈ క్రమంలోనే ఆమె పోస్ట్ చేసిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ హీరోయిన్ గురించి తెలిసిన వాళ్ళు ఆమె ఇంత వయస్సులో కూడా ఇంత గ్లామర్ గా ఎలా ఉంది అంటూ ఫాలో అవుతున్నారు.మరోపక్క తెలియని వాళ్ళు కూడా ఆమె ఏ సినిమాలో హీరోయిన్ గా నటించింది అని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను ఫాaలో అయ్యి ఆమె ఎవరో తెలిసాక ఆశ్చర్యపోతున్నారు.ఈ హీరోయిన్ పేరు దివ్య వెంకట సుబ్రహ్మణ్యం.

దర్శకుడు మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ నిర్మించి ఫైవ్ స్టార్ అనే తమిళ్ సినిమా ద్వారా 2002 లో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఆ తర్వాత ఈమె తెలుగులో హీరో శ్రీకాంత్ కు జోడిగా ఒట్టేసి చెపుతున్న అనే సినిమాతో 2003 లో ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత ఈమె తెలుగులో రవితేజ హీరో గా చేసిన నా ఆటో గ్రాఫ్ స్వీట్ మెమోరీస్ అనే సినిమాలో కూడా నటించింది.

ఆ తర్వాత ఈమె తెలుగు సినిమాలలో కనిపించలేదు.కానీ ఈమె తమిళ్,మలయాళం లో కలిపి ఇరవై సినిమాలకు పైగా నటించింది.హీరోయిన్ గానే కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.ప్రస్తుతం 41 ఏళ్ళు వయస్సు ఉన్న ఈమె యువ హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న గ్లామర్ ఫోటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *