Malliswari: మల్లీశ్వరిలో నటించిన బాల నటి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. చూస్తే షాక్ అవుతారు..!

Malleswari
Malleswari

Malliswari: గొప్ప గొప్ప తారాగణంలో బాల నటిగా నటించి గుర్తింపు తెచ్చుకున్న వారు ఇప్పుడు అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నారు. అందులో కొందరు హీరోయిన్లుగా మళ్లీ చిత్ర సీమవైపు వస్తుంటే. మరి కొందరు చదువు, కెరీర్ లపై ఆసక్తి పెంచుకొని మంచి రంగాల్లో స్థిరపడుతున్నారు. ప్రముఖ హీరో వెంకటేశ్, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ నటించిన చిత్రం మల్లీశ్వరి (పాతది కాదు). కే విజయ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో వెంకటేశ్ అన్నయ్య చంద్రమోహన్ కూతురిగా నటించింది చిన్నారి ‘గ్రీష్మ నేత్రిక’.

భారీ తారాగణంతో టాలీవుడ్ బాక్సాఫీస్ కు హిట్ ఇచ్చిన చిత్రం ఇది. ఇందులో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్నది ‘గ్రీష్మ నేత్రిక’ చిన్నతనంలోనే టాప్ తారాగణంతో నటించి మెప్పించిన చిన్నది దాదాపు 30కి పైగా చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది.మల్లీశ్వరిలో ఒక సన్నివేశంలో వెంకటేశ్ గ్రీష్మకు చాక్లెట్ ఇస్తూ చాకోబార్ అంటాడు. ‘బార్ అంటే ఇంత బారుగా ఉండాలంటూ’ ఆమె మంచి అభినయం ప్రదర్శించారు. పంచాక్షరి, ఏమో గుర్రం ఎగరావచ్చు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి బ్లాక్ బస్టర్లు కూడా చిన్నదాని ఖాతాలో ఉన్నాయి.

ఇంకో మూవీ వందేమాతరం శ్రీనివాస్ ముఖ్య పాత్రలో వచ్చిన ‘అమ్ములు’లో కీ రోల్ చేసింది. ఈ రోల్ కు ఆమెకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాల కోసం చూస్తోంది.ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ బయోగ్రఫీతో తీసిన ‘ఎన్టీఆర్: కథానాయకుడు’లో నటించి మెప్పించింది. తన చదువు పూర్తి చేసుకుని హీరోయిన్ గా వచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. చైల్డ్ ఆర్టిస్టుగా రాణించిన ఆమె ‘లవ్ యూ బంగారం’లో కథానాయకిగా నటించింది.నందిని నర్సింగ్ హోమ్ లో నటించిన శ్రవ్య, గ్రీష్మ నేత్రిక సోదరీమణులు ఇది చాలా మందికి తెలియదు. ఆర్య, కాయ్ రాజా కాయ్, అవునన్నా కాదన్నా లాంటి సినిమాలలో శ్రావ్య నటించి గుర్తింపు తెచ్చకుంది. ఇక గ్రీష్మ హీరోయిన్ గా ఎలా రాణిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *