Keerthy Suresh: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోయిన్లలో కీర్తి సురేష్ కూడా ఒకరు. తెలుగు, తమిళ్ భాషలలో కీర్తి సురేష్ ఇప్పటివరకు చాలా సూపర్ హిట్ సినిమాలలో నటించింది. మహానటి సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా కీర్తి సురేష్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సౌత్లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ తాజాగా బేబీ జాన్ అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలో వరుణ్ ధావన్ (Varun Dhawan) కు జోడిగా నటించింది. పెళ్లయిన మూడు రోజులకే కీర్తి సురేష్ (Keerthy Suresh) బేబీ జాన్ సినిమా ప్రమోషన్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదని చెప్పొచ్చు. ఈ సినిమాకు కలెక్షన్లు కూడా అంతంత మాత్రం గానే ఉన్నాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇదిలా ఉంటే బేబీ జాన్ సినిమా కోసం హీరోయిన్ కీర్తి సురేష్ నిత్యం ముంబైలో సందడి చేస్తుంది.
ఈ క్రమంలోనే కొందరు ఫోటోగ్రాఫర్ కీర్తి సురేష్ ను ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. అక్కడున్న ఫోటోగ్రాఫర్స్ కొందరు ఆమెను కృతి అంటూ పిలిచారు. అప్పుడు కీర్తి సురేష్ నా పేరు కృతి కాదు కీర్తి అని తెలిపింది. అలాగే మరికొంతమంది కీర్తి దోస అనే పిలవడంతో ఈమె అభ్యంతరం వ్యక్తం చేసింది. నా పేరు కీర్తి దోస కాదు కీర్తి సురేష్ అని చెప్పి నాకు దోస అంటే చాలా ఇష్టం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తి సురేష్.