Jr NTR Gopichand: ఒకే కథతో వచ్చిన గోపీచంద్,ఎన్టీఆర్ సినిమాలలో ఏది హిట్ అయ్యిందో తెలుసా..!

Jr NTR Gopichand
Jr NTR Gopichand

Jr NTR Gopichand: ఒక్కోసారి కొన్ని కొన్ని సినిమాల కథలు ఒకేలాగా అనిపించినా కూడా వాటి కథనాలు వేరుగా ఉంటాయి.ప్రముఖ రచయితా అయినా పరుచూరి గారు చెప్పినట్టు దేవదాసు,అర్జున్ రెడ్డి సినిమా కథలు ఒకటే అయినా కూడా వాటి కథనాలు వేరుగా ఉంటాయి.అయితే ఈ రెండు సినిమాలు కూడా చరిత్ర సృష్టించిన హిట్ సినిమాలే.కొన్ని సినిమాల కథలు ఒకేలాగా ఉన్న కూడా వాటి కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితేనే అవి హిట్ అవుతాయి.ఒక్కోసారి హీరోల ఇమేజ్ ను బట్టి,కథనాలను బట్టి సినిమా ఫలితాలు ఉంటాయి.

హీరో గోపీచంద్ మరియు ఎన్టీఆర్ ఒకే కథతో సినిమా చేసారు.ఈ సినిమా ఫలితాలలో పెద్ద తేడా అయితే లేదని చెప్పచ్చు.బి వి ఎస్ రవి దర్శకత్వంలో గోపీచంద్ 2011 లో వాంటెడ్ అనే సినిమా చేసారు.ఈ సినిమాలో హీరో హీరోయిన్ ల మధ్య ప్రేమ మొదలవుతుంది…కానీ హీరోయిన్ ప్రేమించాలంటే విలన్ కుటుంబాన్ని చంపాలని హీరోకు షరతు పెడుతుంది.

విలన్ చేతిలో హీరోయిన్ కుటుంబం మొత్తం చనిపోవడం ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు.ఇదే స్టోరీ నీ సురేందర్ రెడ్డి ఊసరవెల్లి సినిమాగా ఎన్టీఆర్ తో తెరకెక్కించారు.ఈ రెండు చిత్రాలలో వాంటెడ్ చిత్రం ప్లాప్ అయింది.ఊసరవెల్లి చిత్రం బీలో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ రెండు సినిమాలలోనూ ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు.ఈ రెండు సినిమాలలోనూ హీరోయిన్ ఫ్యామిలీ లో ఒకరు పోలీస్ ఆఫీసర్ ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *