Bangaram: తన కెరీర్ లో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలు రిసల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తాయి.అలా పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమాలలో బంగారం సినిమా కూడా ఒకటి.2006 లో విడుదల అయినా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోయిన ఆ సినిమాలోని పాటలు మాత్రం ఒక రేంజ్ లో హిట్ అయ్యాయి.ధరణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన,యాటిట్యూడ్,పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతం అందించారు.ఈ సినిమాలో పవన్ జర్నలిస్టు పాత్రలో అలరించారు.మీరా చోప్రా ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అయినా ప్రియాంక చోప్రా,పరిణితి చోప్రా బంధువు.ఈమె తెలుగుతో పటు తమిళ్,హిందీ లో కూడా పలు సినిమాలలో నటించడం జరిగింది.2018 లో నాస్తిక్ అనే హిందీ సినిమాలో నటించిన ఈమె ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది.
దాదాపుగా 30 కు పైగా సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే మీరా చోప్రా తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.లేటెస్ట్ గా ఈమె షేర్ చేసిన ఫోటోలలో మీరా చోప్రా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.ప్రస్తుతం ఈ ఫోటోలలో మీరా చోప్రా ను చూసి అందరు షాక్ అవుతున్నారు.