Anjana Arjun: అర్జున్ రెండో కూతుర్ని చూశారా హీరోయిన్ ల యెంత అందంగా ఉందో తెలుసా..!

Anjana Arjun
Anjana Arjun

Anjana Arjun: తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు సీనియర్ హీరో అర్జున్. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యమున్న అర్జున్ యాక్షన్ సన్నివే శాలను చాలా సులువుగా చేస్తుంటాడు. సౌత్ సినిమాల్లో రిస్కీ స్టంట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. సోలో హీరోగా చేస్తూనే మల్టీస్టారర్ సినిమాల్లోనూ చేసి మెప్పించాడు. తెలుగులో విలన్ గాను చేసి మెప్పించాడు. ఇటీవల హీరోగా సినిమాలు తగ్గించేసిన ఈ సీనియర్ హీరో పలు చిత్రాల్లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలు చేస్తున్నాడు. తెలుగులో నితిన్ తో శ్రీ ఆంజనేయం, మెగా స్టార్ చిరంజీవితో కలిసి చేసిన శ్రీ మంజునాథ సినిమాలో శివ భక్తుడిగా అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. ఇందులో చిరంజీవి కన్నా అర్జున్ కే మంచి పేరొచ్చింది. సౌత్ లోని అన్ని భాషల్లోనూ ఈ సినిమా డబ్ అయ్యింది. యాక్షన్ చిత్రాలతో పాటు భక్తిరస చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు అర్జున్.

కొన్నేళ్ల క్రితం వరకు అర్జున్ తన కుటుంబాన్ని సినిమాలకు దూరంగానే ఉంచాడు. అర్జున్ కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతరు ఐశ్వర్య హీరోయిన్ గా చేసింది. ఇటీవలే పెళ్లి చేసుకుంది. అయితే అర్జున్ దాదాపు ఏడాదిన్నర క్రితం తన దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తన కూతరును లాంచ్ చేసేందుకు సినిమా మొదలు పెట్టాడు. సినిమా షూటింగ్ ప్రారంభోత్సవాన్ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. కానీ కొన్ని రోజులకే హీరో అర్జున్, విశ్వక్ సేన్ మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో వివాదానికి దారి తీసింది. అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ సేన్ తనను ఇబ్బంది పెట్టాడని చెప్పాడు. నిర్మాతల మండలికి కూడా కంప్లైంట్ చేశాడు. ఆ తర్వాత కన్నడలో ఓ సినిమా చేసిన ఐశ్వర్య ఆ తర్వాత సినిమాలకు దూరమైంది.

రెండో కూతరు అంజనా కూడా హీరోయిన్ మెటీరిల్ కు తక్కువేం లేదు. అయితే సినిమాల్లోకి మాత్రం రావడం లేదు. సోషల్ మీడియాలో తన ఫొటోషూట్స్ తో చాలా మంచి పేరు తెచ్చుకుంది. మోడల్ గా కూడా పలు ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంది. ఇటీవల సర్జా వరల్డ్ అనే హ్యాండ్ బ్యాగ్స్ కంపెనీని ఏర్పాటు చేసిన బిజినెస్ లో రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ప్రస్తుతం అంజనా అర్జున్ ఫోటోలు వైరల్ కావడంతో హీరోయిన్ లా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.అక్కలాగే అంజనా కూడా హీరోయిన్ అయితే బాగుంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో తన ఫొటోలతోనే పాపులారిటీ తెచ్చుకున్న అంజనా ఫ్యూచర్ లో హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Anjana Arjun (@anj204)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *