Actress Urvashi: ఊర్వశి గుర్తుందా..! మరి ఆమె కూతురు తెలుసా..! హీరోయిన్‌గా రాబోతోంది..!

Actress Urvashi

Actress Urvashi: తమిళం, తెలుగుతోపాటు పలు భాషల్లో అనేక చిత్రాల్లో నటించి అందరినీ హాస్యపు జల్లుల్లో ముంచిన నటి ఊర్వశి మీకు గుర్తుండే ఉంటుంది. శర్వానంద్ హీరోగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు..’, సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ వంటి సినిమాల్లో నటించిన ఊర్వశి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఇండస్ర్టీలో నిలబెట్టుకున్నారు. ఎప్పుడూ హాస్యపాత్రల్లోనే కాకుండా సెంటిమెంట్‌ను సైతం పండించగలనని నిరూపించుకుంది. ఓ బేబీ సినిమాలో విభిన్న పాత్రలో నటించి మెప్పించారు. విభిన్న పాత్రలతో ఫిల్మ్ ఇండస్ర్టీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఊర్వశి ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు.

గతంలో హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రత్యేకంగా ఈమె పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టక పోవొచ్చు గానీ, తెరపై చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. అక్కా, వదిన, తల్లి, పిన్ని వంటి పాత్రల్లో కరెక్టుగా సూట్ అవుతారు ఊర్వశి. ‘ఓ బేబీ’ మూవీలో రాజేంద్ర ప్రసాద్ మరదలిగా నటించి ప్రేక్షకులను హాస్యపు జల్లుల్లో ముంచేసారు. తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు.

సినీ ఇండస్ర్టీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలపర్చుకున్న ఊర్వశి మాత్రమే మనకు తెలుసు. కానీ ఆమె కుటుంబ విషయాలు బయటి ప్రపంచానికి అంతగా తెలియవు. ఆమెకు ఓ కూతురు ఉందని, ఆమె పేరు కుంజత అని చాలా మందికి తెలియకపోవచ్చు. కుంజత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తేజ లక్ష్మి పేరుతో నెట్టింట హల్ చల్ చేస్తున్నది. త్వరలోనే ఆమె హీరోయిన్‌గా తన అద‌ృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది.

ఇటీవల ఊర్వశి తన ఇన్‌స్టా్గ్రామ్‌లో షేర్ చేసిన ఫ్యామిలీ ఫొటోస్ వైరల్ అయ్యాయి. అందులో ఏముంది గొప్ప ఉత్త ఫ్యామిలీ ఫొటోస్‌కే ఇంత బిల్డపా అని క్వశ్చన్ మార్క్ మొహం పెట్టకండి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఊర్వశి కూతురు కుంజత ఫొటోలు సైతం షేర్ చేసింది. ఆమె అందచందాలు చూసి అభిమానులు హీరోయిన్‌లా ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. హీరోయిన్‌గా ఇండస్ర్టీలో అడుగు పెట్టొచ్చన్న వార్తలు వినిపించాయి. అనుకున్నట్లుగా ఆమె త్వరలోనే తెరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ.. తన కూతురును హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. హీరోయిన్‌గా చాన్స్ రావడంతో ఆ ప్రాజెక్టును ఒప్పేసుకున్న కుంజంత నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానున్నది.

కేరళ నటుడు మనోజ్ జైన్‌ ఊర్వశి భర్త. ఇండస్ర్టీలో పరిచయమైన మనోజ్‌తో కొద్ది రోజులు ప్రేమాయణం కొనసాగించిన ఆమె 2000లో ఆయనను వివాహం చేసుకున్నది. వీరికి కూతురు పుట్టగా, తేజ లక్ష్మి అని పేరుకున్నారు. సాఫీగా సాగిన ఊర్వశి, మనోజ్ వైవాహిక దాంపత్య జీవితం ఎనిమిదేళ్లు ఎడబాసింది. మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకొని ఎవరికి వారు జీవిస్తున్నారు. కాగా ఊర్వశి మరో వివాహం చేసుకున్నది. శివప్రసాద్ అనే వ్యక్తిని ద్వితీయ వివాహం చేసుకొని దాంపత్య బంధాన్ని కొనసాగిస్తోంది. వీరికి కుమారుడు ఉన్నారు. పేరు ఇషాన్. ప్రస్తుతం ఊర్వశి ఇటు తెలుగు, అటు తమిళం చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా ఇటీవలో ఊర్వశి ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. కూతురు తేజ లక్ష్మి, కుమారుడు ఇషాన్ మూవీ సెట్‌లో సందడి చేస్తూ కనిపించారు.

 

View this post on Instagram

 

A post shared by तेजा🪬 (@mkt_999)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *