5 rupees coins: భారత దేశంలో అన్ని ఆర్ధిక వ్యవహారాలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చూసుకుంటూ ఉంటుంది.ఈ క్రమంలోనే బ్యాంకింగ్,ఆర్ధికం కు సంబంధించిన ప్రకటనలను ఆర్బీఐ ప్రకటిస్తూ ఉంటుంది.అయితే తాజాగా ఆర్బీఐ రూ.5 నాణాలను నిలిపివేసే యోచనలో ఉందని తెలుస్తుంది.దీని వెనుక పెద్ద కారణమే ఉందని చెప్పచ్చు.ఈ ప్రకటనతో అందరు షాక్ అవుతున్నాయి.అయిదు రూపాయల నాణాల చలామణిని ఆపివేయాలని ఆర్బీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
దింతో అయిదు రూపాయల నాణాలు చెల్లుబాటు కావని తెలుస్తుంది.మనదేశంలో రెండు రకాలైన అయిదు రూపాయల నాణాలు అందుబాటులో ఉన్నాయి.ఒకటి మందపాటి వెండి అయిదు రూపాయల నాణెం,ఇంకోటి సన్నని ఇత్తడి అయిదు రూపాయల నాణెం.
అయితే తాజాగా ఆర్బీఐ మందపాటి వెండి అయిదు రూపాయల నాణాన్ని చలామణి నుంచి తప్పించాలని భావిస్తుంది.దీనికి ప్రధాన కారణం ఈ నాణెం తయారీకి అయ్యే ఖర్చు ఎక్కువ.ఈ ఖర్చుతో రేజర్ బ్లేడ్ లను తయారు చేయవచ్చు అని తెలుస్తుంది.అయితే ఇత్తడి అయిదు రూపాయల నాణెం చలామణిలో ఉంటుంది.