WhatsApp: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.అలాగే ప్రతి ఒక్కరు కూడా చాట్ చేయడానికి కాల్స్ మాట్లాడడానికి వాట్సాప్ ను ఉపోయోగిస్తున్నారు.దీనికి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే.రోజు రోజుకు సరికొత్త ఫీచర్స్ ను పరిచయం చేస్తూ వాట్సాప్ వినియోగదారులను ఆకర్షిస్తుంది.
తాజాగా వాట్సాప్ మరొక సంస్థ తో జత కట్టి ఒక కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది.తాజాగా OpenAI ఒక కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకోని వచ్చింది.ఈ సరికొత్త ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులు chatgpt తో ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తుంది.
వాట్సాప్ లో ChatGpt సేవలను అందుబాటులోకి తీసుకోని వచ్చినట్లు తాజాగా ఓపెన్ ఏఐ ప్రకటించింది.1 -800 -CHATGPT నెంబర్ ద్వారా యూఎస్,కెనడాలో CHATGPT ద్వారా కాల్స్ మాట్లాడవచ్చు.నెలకు 15 నిముషాలు ఫ్రీగా కాల్స్ మాట్లాడవచ్చు.ఈ సదుపాయం కేవలం యూఎస్,కెనడాలో మాత్రమే ఉంది.ఇండియా లో ఉన్న వారు CHATGPT లో చాట్ చేయడానికి క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే సరిపోతుంది.