Gold Rate Today: ఈ ఏడాది స్టార్టింగ్ లో బంగారం ధరలు పైపైకి వెళ్లాయి.అయితే ప్రస్తుతం గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.డిసెంబర్ నెలలో బంగారం ధరలు తగ్గి ప్రస్తుతం నెల చూపులు చూస్తున్నాయి.బంగారం ధరలు తగ్గి జనాలను ఆకర్షితున్నాయి.నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధర స్వల్పంగానే తగ్గినప్పటికీ బంగారం ధరలో పతనం కనిపిస్తుంది.దింతో బంగారం కొనేవాళ్లకు ఇది మంచి అవకాశం అని చెప్పచ్చు.
అంతర్జాతీయ పరిణామాలు,డిమాండ్ దృష్ట్యా నిత్యం బంగారం లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి.అయితే గత కొన్ని రోజుల నుంచి ఇన్వెస్టర్లను పరేషాన్ చేస్తున్న బంగారం ధరలు ఇప్పుడు తగ్గుతూ కొంత ఊరటను ఇస్తున్నాయి.నిన్న బంగారంలో భారీ పతనం చూసాం.
అయితే నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధర రూ.10 రూపాయలు మాత్రమే తగ్గినప్పటికీ తగ్గుతున్న పసిడి ధరలు పసిడి ప్రియులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.దింతో పసిడి ప్రియులు బంగారం కొనేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర 77 ,120 రూపాయలు ఉండగా,22 క్యారెట్ ల బంగారం ధర 70 ,690 రూపాయలు ఉంది.అలాగే నేడు కిలో వెండి 99 వేల రూపాయలు ఉంది.