
Aadhaar Card: దేశంలో ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉండాల్సిన గుర్తింపు కార్డు ఆధార్ కార్డు. అయితే అలాంటి అత్యవసరమైన ఆధార్ కార్డులో పేరు, చిరునామా మరియు వయస్సును ఎన్నిసార్లు మార్చుకోవచ్చో, రూల్స్ ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. జననం నుంచి మరణం వరకు ప్రతి చోట ఆధార్ కార్డు అవసరం అవుతుంది. అలాగే బ్యాంకు ఖాతా తెరవడం, మొబైల్ నెంబర్ పొందడం, పెట్టుబడి పెట్టడం, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, భీమా ఇలా ప్రతిదానికి కూడా ఆధార్ కార్డును అడుగుతారు.
ఎవరైనా తాము ఉంటున్న నివాసాన్ని మార్చినప్పుడు కూడా తమ ఆధార్ కార్డు లోని చిరునామాను వెంటనే మారుస్తారు. అలాగే ఆధార్ కార్డులో చిరునామా తో పాటు వయస్సు, పేరు లేదా వేరే ఇతర సమాచారాన్ని కూడా మార్చవచ్చు. యుఐడిఎఐ ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కానీ దీనికి కొన్ని నియమాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. అయితే కొన్ని కొన్ని సార్లు ఆధార్ కార్డు లోని వివరాలను మార్చడం సాధ్యం కాదు.
Aslo Read: విద్యార్థులకు హ్యాపీ న్యూస్.. వేసవి సెలవుల కంటే ముందే ఏప్రిల్ నెలలో చాలా సెలవులు
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ప్రకారం ఆధార్ కార్డు ఉన్నవాళ్లు తమ పేరును గరిష్టంగా రెండుసార్లు మార్చుకోవచ్చు. అంటే కేవలం పేరును రెండుసార్లు మాత్రమే మార్చుకునే అవకాశాన్ని యుఐడిఎఐ కల్పించింది. సాధారణంగా మహిళలు వివాహం తర్వాత తమ ఇంటి పేరును మార్చుకుంటారు. ఇటువంటి సమయంలో వాళ్లు అంత మా ఆధార్ కార్డులో పేరును మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే మీ పుట్టిన తేదీలో ఏమైనా వ్యత్యాసం ఉంటే దానిని సరిదిద్దుకోవచ్చు. ఈ అవకాశం కేవలం ఒకసారి మాత్రమే ఉంది.
Aslo Read: ఈ ఫోన్ నెంబర్లు ఉన్నవాళ్లకు యూపీఐ సేవలు బంద్ చేసిన NPCI…ఎందుకంటే
అంటే ఒక ఆధార్ కార్డు జీవిత కాలంలో ఒకసారి మాత్రమే డేట్ అఫ్ బర్త్ ను మార్చుకోవచ్చు. అయితే ఆధార్ కార్డులో చిరునామాను ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. దీనికి యుఐడిఏఐ ఎటువంటి పరిమితిని నిర్ణయించలేదు. విద్యుత్ లేదా నీటి బిల్లు అద్దె ఒప్పందం బిల్లు వంటివి రుజువులను అందించడం ద్వారా లేదా ఆధార నమోదు కేంద్రాన్ని సందర్శించడం ద్వారా కూడా మీరు ఆన్లైన్లో మీ ఆధార్ కార్డు మీద చిరునామాను ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు.