Home బిజినెస్ April School Holidays: విద్యార్థులకు హ్యాపీ న్యూస్.. వేసవి సెలవుల కంటే ముందే ఏప్రిల్ నెలలో...

April School Holidays: విద్యార్థులకు హ్యాపీ న్యూస్.. వేసవి సెలవుల కంటే ముందే ఏప్రిల్ నెలలో చాలా సెలవులు

April School Holidays
April School Holidays

April School Holidays: విద్యార్థులు పాఠశాలలకు సెలవులు ఉంటాయి అంటే చాలు ఎగిరి గంతేస్తారు. సెలవుల్లో బాగా ఎంజాయ్ చేయాలని ఆనందంలో పిల్లలు మునిగిపోతారు. అయితే త్వరలో వేసవి సెలవులు రానున్నాయి. కానీ ఈ సెలవుల కంటే ముందు ఏప్రిల్ నెలలో కూడా పాఠశాలలకు కొన్ని సెలవులు వస్తున్నాయి. ఏప్రిల్ నెలలో పండుగలు, ఇతర కార్యక్రమాల సందర్భంగా కూడా సెలవులు ఉన్నాయి. మరో మూడు నాలుగు రోజుల్లో మార్చి నెల ముగిసి ఏప్రిల్ నెల రానుంది. త్వరలో వేసవి సెలవులు కూడా రానున్నాయి.

వేసవి సెలవుల కంటే ముందు ఏప్రిల్ నెలలో కూడా ఎక్కువగానే సెలవులు రానున్నాయి. వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి ఇవ్వనున్నారు. అయితే ఏప్రిల్ నెలలో మరికొన్ని సెలవులు పిల్లలకు దొరకనున్నాయి. ఈ పండుగలు మరియు ప్రత్యేక దినాల సందర్భంగా సెలవులు విద్యార్థులకు రానున్నాయి. మార్చి 31న రంజాన్ పండుగ సందర్భంగా ఆ మరుసటి రోజు ఏప్రిల్ 1న కూడా పండగ సెలవు ఉంటుంది. రంజాన్ పండుగకు రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి ఆలయాల్లో పెళ్లి వైభవంగా జరుగుతుంది.

ఆ రోజున కూడా విద్యార్థులకు సెలవు ఉంటుంది. ఏప్రిల్ 10న మహావీర్ జయంతి సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఏప్రిల్ 13 బైశాకి ఉంటుంది. ఆరోజు ఆదివారం కాబట్టి అన్ని స్కూల్లు మరియు కాలేజీలకు సెలవు ఉంటుంది. అలాగే ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ జయంతి. దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు ఆరోజు సెలవు ఉంటుంది. ఏప్రిల్ 18 గుడ్ ఫ్రైడే. ఆరోజు కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఏప్రిల్ నెలలో చాలా రోజులు పాఠశాలలకు మరియు కళాశాలలకు సెలవులు రానున్నాయి. కొన్ని ప్రత్యేక రోజులు మరియు పండుగల కు మాత్రం ఆయా ప్రాంతాలకు బట్టి సెలవులు ఉంటాయని గమనించండి. ప్రతి రాష్ట్రానికి ఒక్కో విధంగా అమలు చేస్తారు.