Fixed Deposit: చాల మంది తమ దగ్గర పొదుపు చేసుకున్న డబ్బులను సేఫ్ గా ఉండడానికి బ్యాంకుల్లో ఎఫ్ డి చేస్తూ ఉంటారు.అయితే బ్యాంకు ఎఫ్ డి లకు పోటీగా మార్కెట్ లో కార్పొరేట్ ఎఫ్ డి కూడా ఉన్నాయి.అయితే వీటిలో ఎఫ్ డి చేస్తే మీ డబ్బు సురక్షితంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..గత కొన్ని సంవత్సరాల నుంచి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలు కూడా ఎఫ్ డి సేవలను ప్రారంభించారు.
ఈ ఎఫ్ డి లనే కార్పొరేట్ ఎఫ్ డి అని కూడా అంటారు.బ్యాంకు ఎఫ్ డి లతో పోలిస్తే వీటికి ఎక్కువ వడ్డీ వస్తుంది కానీ డబ్బు భద్రతా విషయం కొంచెం ఆందోళన కలిగిస్తుంది అని చెప్పచ్చు.NBFC క్రెడిట్ యోగ్యతపై కార్పొరేట్ ఎఫ్ డి ఆధారపడి ఉంటుంది.
NBFC ల అధిక రేటింగ్ కలిగిన ఎఫ్ డి లు మాత్రమే ఉరక్షితంగా ఉంటాయి.బ్యాంకు ఎఫ్ డి లలో రిస్క్ తక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు.భారత ప్రభుత్వం బ్యాంకు ఎఫ్ డి ల పై గరిష్టంగా రూ.5 లక్షలు బీమాను అందిస్తుంది.