Aadhaar Update: దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పని సరి అన్న సంగతి తెలిసిందే.ఆధార్ కార్డు ఉన్న వాళ్లకు కీలక అలెర్ట్ ను ప్రకటించింది ప్రభుత్వం.ఎలాంటి రుసుము లేకుండా ప్రస్తుతం మీ ఆధార్ కార్డు ను అప్ డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం.డిసెంబర్ 14 వరకు మాత్రమే ఈ గడువును పొడిగించింది.ఇంకా నాలుగు రోజులలో ఈ గడువు ముగియనుంది.అందుకే ఎవరైనా ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవాలి అనుకు న్న వాళ్ళు ఎలాంటి రుసుము లేకుండా ఇంటి నుంచి మీ ఆధార్ కార్డు ను అప్ డేట్ చేసుకోవచ్చు.
గడువు అయిపోయిన తర్వాత అప్ డేట్ చేసుకునే వాళ్ళు రూ.050 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 10 సంవత్సరాల క్రితం తీసుకున్న ఆధార్ కార్డు ను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం.పది సంవత్సరాల క్రితం తీసుకున్న ఆధార్ కార్డు లో ఏమైనా మార్పులు ఉంటె అవి సరి చేసుకునే ఉద్దేశంతో ఈ ప్రక్రియను కల్పించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా.