Home తాజా వార్తలు RTC Offer: బస్సులో ప్రయాణం చేసే వారికి బంపర్ ఆఫర్ ను ప్రకటించిన ఆర్టీసీ.!

RTC Offer: బస్సులో ప్రయాణం చేసే వారికి బంపర్ ఆఫర్ ను ప్రకటించిన ఆర్టీసీ.!

RTC Offer
RTC Offer

RTC Offer: తెలంగాణా రాష్ట్రానికి మరియు ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోడ్డు రవాణా శాఖ అనేది బస్సు సేవలు అందిస్తున్న ప్రభుత్వ యాజమాన్య సంస్థ.మూడు జోన్లు,99 డిపోలు కలిగి ఉన్న టిజిఎస్ ఆర్టీసీ ప్రతి రోజు అరవై లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు.ఈ బస్సులు 36 ,593 రూట్లలో కార్యకలాపాలు చేపట్టాయి.టిజిఎస్ ఆర్టీసీ గ్రామీణ ప్రాంతాలకు పల్లెవెలుగు బస్సులు మరియు పట్టణాలకు ఎక్స్ప్రెస్,సూపర్ లగ్జేరి,రాజధాని,డీలక్స్,గరుడ బస్సుల ద్వారా ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు.

మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం లోని మహిళలకు ఎక్స్ప్రెస్,పల్లెవెలుగు బస్సులలో ఉచితంగా ప్రయాణం కల్పించిన విషయం అందరికి తెలిసిందే.తాజాగా టిజిఎస్ ఆర్టీసీ ప్రయాణికులు మరొక శుభవార్త ను ప్రకటించింది.ఎసి బస్సుల టికెట్ ఛార్జి పై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.టిజిఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను దీని గురించి ఓ ప్రకటనలో తెలిపారు.ఆయన మాట్లాడుతూ నిత్యం ఎంతో మంది వరంగల్ నుంచి హైదరాబాద్ కు ప్రయాణం చేస్తూ ఉంటారని ఈ రాయితీ వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని తెలిపారు.ఈ ఆఫర్ డిసెంబర్ నెల మొత్తం ఉంటుందని ఆయన తెలిపారు.