Nails: ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనే విషయం డాక్టర్లు కళ్ళను మరియు నాలుకను చూసి చెప్తుంటారు.అయితే గోళ్లను కూడా చూసి మనిషి ఆరోగ్యం గురించి చెప్పవచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు.అయితే గోళ్లను బట్టి ఆరోగ్యాన్ని ఎలా చెప్పవచ్చు…అనారోగ్యంగా ఉన్నప్పుడు గోళ్లు ఎలా ఉంటాయి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం..చేతి గోళ్లు అందరికి ఒకే విధంగా ఉండవు.అలాగే చాల మందికి చేతి గొల్ల మీద తెల్ల తెల్లని మచ్చలు అనేవి ఉంటాయి.మరికొంత మందికి అయితే గోళ్లు వేరే వేరే రంగులలో ఉంటాయి.అయితే చాల మందికి గోళ్లపై అర్ధచంద్రాకారంలో ఒక ఆకారం ఉంటుంది.
ఇలాంటి ఆకారాన్ని లూనులా అని అంటారు.ఈ ఆకారం అంటే లునులా లు అనేవి అందరికి చేతి గోళ్లపై ఒకే విధంగా ఉండవు.కొందరికి పెద్దవిగాను మరికొంత మందికి చిన్నవి గాను ఈ లునులా లు ఉంటాయి.మరికొంత మందికి లునులా లు ఉండవు.ఈ లునులా లు పెద్దవిగా ఉన్నవారు సంపూర్ణ ఆరోగ్యవంతులు అని డాక్టర్లు చెప్తున్నారు.ఇలా పెద్దవిగా ఉన్న వారిలో థైరోయిడ్ గ్రంథులు,కాలేయం,జీర్ణ శక్తి సక్రమంగా పనిచేస్తుందని చెప్పచ్చు.
అయితే ఈ లునులా లు చిన్నవిగా ఉన్న వారు అజీర్ణ శక్తి అధికంగా ఉన్నవారు అని అర్ధమట.ఇటివంటి వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.రక్త ప్రసరణను సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు అని వైద్యులు చెప్తున్నారు.అయితే లునులా లు లేని వారు పౌష్టికాహార లోపం,రక్త హీనత,థైరోయిడ్ గ్రంథి లో హార్మోన్ల హెచ్చు తగ్గులు వంటి సమస్యలు ఎదుర్కొంటారు అని డాక్టర్లు చెప్తున్నారు.జుట్టు రాలడం,బరువు పెరగడం,మానసిక ఒత్తిడి వంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారు అని వైద్యులు చెప్తున్నారు.