Budget 2024: రాబోయే బడ్జెట్ లో రైతులకు మరొక శుభవార్త చెప్తున్న మోడీ ప్రభుత్వం.!

Budget 2024

Budget 2024: దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడో సారి తన బాధ్యతలను స్వీకరించిన సంగతి అందరికి తెలిసిందే.దేశ ప్రజలు ఆర్ధికంగా ఎదిగేందుకు మోడీ సర్కార్ ఇప్పటికే ఎన్నో పథకాలను తీసుకోని వచ్చారు.రైతుల కోసం కూడా కొన్ని పథకాలను తీసుకోని వచ్చారు.అందులో ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన.పీఎం కిసాన్ సమ్మాన్ యోజన అనే పథకం ద్వారా రైతులకు మూడు విడతల్లో 2000 రూపాయలు చొప్పున ఏడాదికి రూ.6000 రూపాయలు అందిస్తారు.

ఇటీవలే వారణాసి లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు 17 వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రూ.20 వేల కోట్లను విడుదల చేసారు.సార్వర్తిక ఎన్నికల తర్వాత మూడో సారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మోడీ దేశ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే రైతులకు మరొక శుభవార్త అందించేందుకు రెడీ అవుతున్నారు మోడీ సర్కార్.రైతుల పీఎం కిసాన్ యోజన సాయం పెంచాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం.ప్రతి ఏడాది ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్న నిధి రూ.6000 నుంచి రూ.8000 పెంచుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తలు గత ఏడాది నుంచే వినిపిస్తుండగా ఈ సారి మోడీ ప్రభుత్వం మరో సారి అధికారం లోకి రావడంతో ఈ సారి పీఎం కిసాన్ యోజన సాయాన్ని పెంచుతారని అందరు భావిస్తున్నారు.అయితే ఫిబ్రవరి 1 న ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ పథకాన్ని పెంచే ప్రకటన చేస్తారని అందరు భావించారు.కానీ అలంటి ప్రస్తావన ఏది ఈ బడ్జెట్ లో రాలేదు.

ఇక జులై లో పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టె బడ్జెట్ లో పీఎం కిసాన్ యోజన సాయాన్ని పెంచే పథకం ఉంటుందని అందరు చెప్తున్నారు.ఇటీవలే వారణాసి లో మోడీ రూ.20 వేల కోట్లను 17 వ విడతలో మంజూరు చేసారు.అంటే ఏడాదికి రూ.60 వేల కోట్లు అవుతుంది.అయితే రూ.6000 నుంచి రూ.8000 కు పెంచితే కేంద్రం పై అదనపు భారం రూ.15 కోట్లు పడుతుంది.మరి రాబోయే రోజుల్లో ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ పథకం పై ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *