Eggs: రోజు గుడ్డు తింటున్నారా…ఈ సమస్యలు ఉన్న వాళ్ళు గుడ్డు అస్సలు తినకూడదు..!

Eggs: గుడ్డు లో పోషకాలు అధికం గా ఉండడం వలన ప్రతి రోజు ఒక గుడ్డు తినమని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు.మనిషి శరీరానికి కావలసిన అనేక పోషకాలు గుడ్డులో లభిస్తాయి.ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ప్రతి రోజు మూడు గుడ్లు తినవచ్చు.కానీ అలా తినే వాళ్ళు తప్పనిసరిగా ప్రతి రోజు వ్యాయామం కూడా చేయాలి.గుడ్డు లో చాల రకాలైన విటమిన్ లు పుష్కలం గా లభిస్తాయి.ముఖ్యంగా విటమిన్ బి కూడా గుడ్డు నుంచి లభిస్తుంది.ఇలా ఎన్నో పోషకాలు ఉన్న గుడ్లు కొంత మంది తినడం వలన అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు నిపుణులు.

ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా గుడ్లను ఎక్కువగా తినడం వలన అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది.గుడ్డులో ఉండే ఎక్కువ కొలెస్ట్రాల్ కారణంగా మధుమేహం,ప్రోస్టేట్,పెద్ద పేగు వాపు,కొలొరెక్టర్ కాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందట.గుండె సమస్యలతో బాధపడుతున్న వారు గుడ్డు తినకుండా ఉంటె మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.కిడ్నీ సమస్యలు ఉన్న వారు కూడా గుడ్డు తినడం వలన ఆ సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.బరువు తగ్గించుకోవాలి అని అనుకుంటున్నా వారు కూడా గుడ్డు కు దూరం గా ఉండాలి.

ఒకవేళ గుడ్డు ను తినాలి అనుకున్న వాళ్ళు యెల్లో లో అధిక కొవ్వు ఉంటుంది కాబట్టి ఎల్లో వదిలి వైట్ తినడం మంచిది.జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు గుడ్డు ను తీసుకోవడం వలన కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.అలాగే డయేరియా ఉన్న వాళ్ళు కూడా గుడ్డు ను సేవించటం వలన ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు.ఎక్కువగా చెడు కొలెస్టిరాల్ ఉంటె రక్త ప్రసరణ సమస్యలు వస్తాయి.అందుకే ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు అందులోని వైట్ ను మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Comment