Current Bill: ఎండాకాలం అయినా శీతాకాలం అయినా కూడా సీజన్ తో సంబంధం లేకుండా వస్తున్నా కరెంటు బిల్లులు సామాన్యులకు బెంబేలెత్తిస్తున్నాయి.ఈ మధ్యకాలంలో కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి అంటూ చాల మంది కరెంటు ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారు.కరెంటు ను ఆదా చేసుకుంటే కరెంటు బిల్లును కూడా తగ్గించుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.చిన్న చిన్న చిట్కాలతో కరెంటు బిల్లును ఆదా చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు.అవి ఏంటంటే..
వ్యాంపైర్ అప్లియన్సెస్ వాడటం:ఈ ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ ఆఫ్ లో ఉన్న కూడా కరెంటు ను పీల్చేస్తాయి అందుకే వాటికీ వ్యాంపైర్ అని పేరు వచ్చింది.ఆఫ్ లో ఉన్న కూడా అవి ఎంతో కొంత కరెంటు ను లాగేస్తుంటాయి.వైఫై రూటర్లు,సెల్ ఫోన్ ఛార్జర్లు,కంప్యూటర్లు,టీవీలు,ఐరన్ బాక్స్,లాప్ టాప్,వాషింగ్ మెషిన్ ఇలా ప్లగ్ కు పెట్టి ఉండి ఆఫ్ లో ఉన్న కూడా కరెంటు ను పీల్చేస్తాయి.అందుకే వాటిని ఎప్పటికప్పుడు యూజ్ చేసిన వెంటనే ప్లగ్ నుండి తీసివేయాలి.
కెపాసిటీ కి తగినట్లు ఉపయోగించాలి:
ఏసీ,వాషింగ్ మెషిన్,గ్రీజర్ వంటి వాటికీ కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది.వాటిని వాడే విధానాన్ని బట్టి కూడా కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.వాషింగ్ మెషిన్ ను ఎక్కువ బట్టలు వేసి ఎక్కువ కెపాసిటీ తో లోడ్ చేస్తే ఎక్కువ లోడ్ పడి ఎక్కువ కరెంటు తీసుకుంటుంది.అలా కాకుండా తక్కువ బట్టలు వేసి రెగ్యులర్ గా ఉతకడం వలన తక్కువ కరెంటు వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.ఇలా హెవీ అప్లియన్సెస్ అయినా ఏసీలు,హీటర్లు కెపాసిటీ కి తగినట్లు ఉపయోగించడం వలన కరెంటు బిల్లును ఆదా చేసుకోవచ్చు.కొత్తగా అప్లియన్సెస్ కొనాలి అనుకుంటే వాటి రేటింగ్ ను కూడా పరిగణలోకి తీసుకోవడం వలన కరెంటు కంజంక్షన్ అనేది తగ్గుతుంది.
ఇంటి ప్రాథమిక అవసరాలకు ఉపయోగించేవి:బల్బులు,ఫ్యాన్లు వాటి వలన కూడా కరెంటు ఎక్కువగా కాలుతుంది.సియెల్ఎఫ్,ఎల్ఈఢీ బల్బులు కూడా ఆఫ్ కరెంటు ను తీసుకుంటాయి.అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేసి ఉంచాలి.తక్కువ స్పేస్ లో పని చేసుకునేటప్పుడు స్టడీ ల్యంపులు,ఫాటబుల్ ల్యంపులు వంటివి యూజ్ చేసుకోవాలి.పాత అప్లియన్సెస్:కొత్త వాటి కంటే పాత అప్లియన్సెస్ ఎక్కువ కరెంటు తీసుకుంటాయి.ఆప్టియం ఏజ్ అంటే కాలం చెల్లడం వలన అవి ఎక్కువ కరెంటు తీసుకుంటాయి.పాతవి మార్చేసి మంచి రేటింగ్ ఉన్న కొత్తవి తీసుకోవడం వలన కరెంటు ఆదా చేసుకోవచ్చు.