Visa Rules Change: యుఎస్ వీసా,H -1 B ప్రోగ్రాం లో మార్పులు..అమెరికా వెళ్లే వారికి ఇది మంచి శుభవార్త.!

Visa Rules Change
Visa Rules Change

Visa Rules Change: ఉద్యోగం చేయడానికి లేదా చదువుకోవడానికి భారత్ నుంచి అమెరికా వెళ్లే వాళ్ళు చాల మందే ఉంటారు.అటువంటివారు కొత్త వీసా నిబంధనల గురించి తెలుసుకోవడం చాల ముఖ్యం.భారత్ లోని యుఎస్ ఎంబసీలో వీసా అపాయింట్మెంట్ కొరకు సుదీర్ఘ నిరీక్షణంను తగ్గించడానికి జనవరి 1 ,2025 నుంచి కొత్త మార్పులు చేయనుంది.యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ కూడా H -1 B వీసా ప్రోగ్రాం లో పెద్ద మార్పును చేయనుంది.

ఈ మార్పులు వీసా ప్రక్రియను సులభం మరియు వేగవంతం చేస్తాయని చెప్పచ్చు.కొత్త నిబంధనల ప్రకారం ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా ఒకసారి అపాయింట్మెంట్ ను రీ షెడ్యూల్ చేసుకోవచ్చు.ఒకవేల మీరు అపాయింట్మెంట్ ను మిస్  చేసిన లేదా రెండో సారి అపాయింట్మెంట్ ను రీ షెడ్యూల్ చేసిన $185 అంటే రూ.15 ,730 నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాలి.వీసా ప్రక్రియ సజావుగా సాగడానికి ప్రజలు అపాయింట్మెంట్ రోజున సమయానికి చేరుకోవాలని యుఎస్ ఎంబసీ కోరింది.

H -1 B వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారు జనవరి 17 ,2025 నుంచి తమ విద్యార్హత నేరుగా వారు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి సంబంధించింది అని నిరూపించుకోవాలి.ఇంటర్వ్యూ మినహాయింపులో కూడా మార్పులు చేపట్టడం జరిగింది.గతం లో వీసా కోసం అప్లై చేసుకున్న వారు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం వచ్చిన కొత్త నియమాలు తరచుగా యుఎస్ కు వెళ్లే వారికి అలాగే మంచి వీసా చరిత్ర ఉన్న వారికి ఎక్కువ ప్రయోజనం కలిగించేలా ఉన్నాయని చెప్పచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *