New Ration Cards: తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై ఒక శుభవార్తను ప్రకటించింది. సంక్రాంతి పండుగ తర్వాత తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కొత్తగా 10 లక్షల తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేయనున్నారు. రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి త్వరలోనే ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు.
ఈ సంక్రాంతి పండుగకు పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రజలకు ఇవ్వనున్నారు. అలాగే రైతు భరోసా, రైతుబంధు కూడా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. ముఖ్యమంత్రి తో పాటు ఇతర మంత్రులు కూడా సంక్రాంతి లోపు వీటన్నిటిని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. తాజాగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులను సర్వే చేసే పనిని చేపట్టారు. అసలైన లబ్ధిదారులను కనుగొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఏడాది అవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తనదైన శైలిలో ముందుకు వెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే.