Govt Employees: ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే మహిళకు తల్లి అయినా తర్వాత చట్టం ప్రకారం ప్రసూతి సెలవులు లభిస్తాయి అనే సంగతి అందరికి తెలిసింది.ప్రసూతి సెలవుల సమయంలో మహిళలకు శాలరీ కూడా అందుతుంది.అలాగే మహిళలతో పాటు తండ్రి అయినా పురుషులకు కూడా పితృత్వ సెలవులు ఉంటాయి.మహిళలతో పోలిస్తే తండ్రి అయినా వారికి తక్కువగా పితృత్వ సెలవులు ఉంటాయి.
అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళలకు మాత్రమే ప్రసూతి సెలవులు లభిస్తాయి అనే సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా ఈ రూల్స్ లో కీలక మార్పు చేస్తూ కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది.ఇప్పటి వరకు సరోగసి ద్వారా బిడ్డను పొందే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయాలి అనే రూల్ లేదు.కేంద్రం 50 ఏళ్ళ నాటి నిబంధనలకు సవరణలు చేస్తూ కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై సరోగసి ద్వారా బిడ్డను పొందే కేంద్ర మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రసూతి సెలవులు మంజూరు అవుతాయి.కేంద్రం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ను 1972 ను సవరించి ఇకపై సరోగసి ద్వారా బిడ్డను పొందే మహిళకు సెలవులు ఇచ్చేలా ప్రకటించింది.ఇప్పటి నుంచి సరోగసి అంటే అద్దె గర్భం ద్వారా పిల్లలను పొందే ప్రభుత్వ ఉద్యోగ తల్లులకు 180 రోజులు చైల్డ్ కేర్ లీవ్ తో పాటు తండ్రులకు కూడా 15 రోజులు పితృత్వ సెలవులు మంజూరు అవుతాయి.