Abhaya Hastham Money: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇందిరమ్మ అభయహస్తం డబ్బులు చెల్లించేందుకు నిర్ణయించడంతో తెలంగాణ (Telangana) మహిళలకు లబ్ధి చేకూరుతుంది. ఏడాది క్రితమే అభయం మొత్తం డబ్బులు చెల్లించేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే హామీ ఇచ్చినప్పటికీ డబ్బులు జమ కాకపోవడంతో లబ్ధిదారులకు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
రెండు నెలల క్రితం నిర్వహించిన సర్వే ప్రకారం జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష మందికి చెల్లించినట్లు గుర్తించారు. డబ్బులు జమ కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మళ్ళీ ఇటీవలే ఈ విషయంపై ప్రకటించడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సభ్యులు ఏటా 365 రూపాయలు చెల్లించి ఉండగా ప్రభుత్వం 365 మహిళలకు జమ చేసేది.
ఇలా జమ చేసిన డబ్బులను 60 ఏళ్ళు నిండిన తర్వాత పింఛన్ కింద 500 రూపాయలు చొప్పున ప్రతినెల చెల్లించేవారు. వృద్ధులకు 500 రూపాయలు చొప్పున ఐదేళ్లపాటు పింఛన్ చెల్లించారు. మహిళలకు అభయహస్తం కింద చెల్లించిన డబ్బులు మంజూరు కాగానే నామిని ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. లబ్ధిదారుల నామిని చనిపోతే వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి వారి ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.