8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఒక శుభవార్తను తెలిపింది. ప్రతి పదేళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఒక పే కమిషన్ను ప్రవేశపెడుతుంది. 2006, జనవరి 1న 6వ వేతన సంఘం అమలులోకి వచ్చింది. అలాగే 2016 జనవరి 1 నుంచి 7వ వేతన సంఘం అమలులోకి వచ్చింది. ప్రస్తుతం ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎనిమిదో వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అమలు చేసింది.
2026, జనవరి 1 నుంచి 8 వ వేతన సంఘం అమలులోకి రానుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల జీతాలు ఎంతవరకు పెరుగుతాయని చర్చలు జరుగుతున్నాయి. అయితే ఉద్యోగుల జీతాలు 10 నుంచి 30 శాతం వరకు పెరగొచ్చు అని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జీతం సవరణలను నిర్ణయించడంలో ఫిట్మెంట్ ఫ్యాక్టరు కీలకంగా పనిచేస్తుంది. ఇది రివైజ్డ్ పే స్కేల్నో లెక్కించడానికి ఉపయోగించే మల్టీ ప్లేయర్. భారత మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ చెప్పిన దాని ప్రకారం 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టరీ డిమాండ్లో వాస్తవం లేదు. కొత్త శాలరీ స్ట్రక్చర్ ను పే కమిషన్ నిర్ణయించేటప్పుడు జనవరి 1, 2026 నాటికి బేసిక్ పే, డియర్ నెస్ అలవెన్స్ ని పరిగణలోకి తీసుకుంటుంది.