Pomegranate: ఆరోగ్యానికి పండ్లు చాలా మేలు చేస్తాయి. అయితే దానిమ్మ పండు లో ఉన్న పోషకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానిమ్మ పండులో ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు వంటివి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయితే ఆరోగ్యానికి చాలా మేలు చేసే దానిమ్మ (Pomegranate) పండును మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం అసలు తినకూడదు. చర్మ సమస్యలు ఉన్నవాళ్లు దానిమ్మ పండును తినకూడదు.
ఒకవేళ తిన్నట్లయితే ఆ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే తక్కువ రక్తపోటు ఉన్నవాళ్లు కూడా దానిమ్మ పండును తినకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు. దానిమ్మ పండు శరీరాన్ని చల్లగా చేసే స్వభావం కలది. కాబట్టి ఇటువంటి దానిమ్మ పండును తక్కువ రక్తపోటు ఉన్నవాళ్లు తిన్నట్లయితే రక్తపోటు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.
అలాగే అధిక రక్తపోటు ఉన్నవాళ్లు కూడా ఈ పండును తినకూడదని నిపుణులు చెప్తున్నారు. అలాగే డయాబెటిస్ సమస్యతో బాధపడే వాళ్ళు కూడా దానిమ్మ పండును తినకూడదు. దానిమ్మ పండులో సహజమైన షుగర్ లో ఉంటాయి కాబట్టి డయాబెటి సమస్యతో బాధపడేవారు ఈ పండును తిన్నట్లయితే షుగర్ లెవెల్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అజీర్ణ సమస్యలు, గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడేవారు దానిమ్మ పండును తినడం వలన ఆ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.