Coconut Water: ఆరోగ్యానికి కొబ్బరి నీళ్ళు (Coconut Water) చాలా మంచిది. శరీరానికి ఆరోగ్యకరమైన పానీయాల గురించి చెప్పాలంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది కొబ్బరినీళ్లు. దీంతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, ఆంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం వంటివి అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచడంతోపాటు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అయితే వీటితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు మాత్రం కొబ్బరినీళ్ళకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో చక్కెర ఉండడం వలన అవి డయాబెటిస్ రోగులకు హానికరం.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ నీళ్లను తాగితే వారి రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంది. షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉండకపోవచ్చు. అందుకే షుగర్ బాధితులు కొబ్బరి నీళ్లను తాగే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది. వీటిలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. మూత్రపిండాల సమస్యతో బాధపడే వారికి ఇది హానికరం. అలాంటివారు అదనపు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేరు. దీంతో కండరాల బలహీనత, తీవ్రమైన సందర్భాల్లో గుండెపోటు వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు వీటిని తాగితే గ్యాస్, విరోచనాలు, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
వీటిలో ఎక్కువగా ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఈ నీళ్లు ఉత్తమమైనవిగా భావిస్తారు. ఒకవేళ మీ రక్తపోటు తక్కువగా ఉన్నట్లయితే పొరపాటున కూడా ఈ నీళ్లను తాగొద్దు అని నిపుణులు చెప్తున్నారు. నేను ఇల్లు తాగడం వల్ల రక్తపోటు మరింత తగ్గుతుంది. దీంతో అలసట, మూర్చ పోవడం, అలా తిరగడం వంటి సమస్యలు కలుగుతాయి. లోబీపీ సమస్యతో బాధపడే వాళ్ళు ఈ నీళ్లకు దూరంగా ఉండడం చాలా మేలు. అలాగే ఏదైనా సర్జరీ చేయించుకోబోతున్నట్లయితే కొబ్బరి నీళ్లను కొన్ని రోజుల ముందే తాగడం ఆపేయాలి. వీటిలో ఉండే ఎలక్ట్రోలైట్లు, ఖనిజాలు శరీర రక్తపోటు మరియు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెప్తున్నారు.